ఒక సినిమాను చూడాలని ఎంతో ఆశగా టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్లి కూర్చుంటాం. టైటిల్స్ పడకముందే తో అడల్ట్స్ జడుసుకునే గాత్రంతో ముకేష్.. తగుదునమ్మ అని తయారవుతాడు. భయంకరమైన విజువల్స్ తో హారర్ సినిమా శాంపిల్ చూపిస్తారు. నిజానికి ఈ సమయంలో క్యాన్సర్ కణితిలోపల ఏముందో చూడాలని పరితపించే మేథావులు తప్ప సాధారణ ప్రజలందరూ మనసులో బండబూతులు తిట్టుకుంటారు. కొందరేమో వాట్సాప్ లో ఏమైనా మెసేజ్ వచ్చిందో చూడాలని డిసైడ్ అవుతారు. ఆ 'దరిద్రం' పూర్తయిన తర్వాతే తలెత్తి చూస్తారు.
అసలు దీన్ని చూసి ఎంతమంది ధూమపాన వ్యసనం వదిలించుకున్నారో.. పొగాకు పదార్థాలను చప్పరించడం మానుకున్నారో దేవుడెరుగు.. సినీ ప్రియులకు మాత్రం ఫ్రస్ట్రేషన్ తప్పడం లేదు. అయితే మారుతి- తేజు సినిమా 'ప్రతిరోజు పండగే' చూడబోయే సినీ ప్రియులకు అభిమానులకు ఈ 'సభ్య సందేశం' చూడాల్సిన ఖర్మ లేదు. ఈ సినిమాలో అసలు స్మోకింగ్ సీన్స్ లేవట. అందుకే నో స్మోకింగ్ యాడ్ లేదట. డైరెక్ట్ గా సినిమా స్టార్ట్ అవుతుంది. ఈమధ్య కాలంలో ముకేష్ ఆవేదన.. రోదన లేని సినిమా ఇదేనట. సో ఆ ముకేష్ టార్చర్ మీకు లేనట్టే. అయినా మాకు ఆ ముకేష్ కావాలి.. వేలాడే దవడలు.. చిల్లులు పడిన ఊపిరిత్తుల విజువల్స్ కావాలి.. ద్రవిడ్ గారి స్వీట్ వాయిస్ లో రన్ ఔట్ కథను వన్స్ మోర్ అంటూ రెండు సార్లు వినాలి అంటే... మిమ్మల్ని ఆ రామ్ గోపాల్ వర్మ కూడా మార్చలేడు.
ఏదేమైనా టైటిల్ లోనే పండగ ఉంది. మంచి బజ్ కూడా ఉంది. అసలు ఈ ముకేష్ లేడనే వార్త ఎంత ఆహ్లాదకరంగా ఉందో మాటల్లో వర్ణించలేం. వాడేమైనా ముకేష్ అంబానీనా? చూస్తే డబ్బు సంపాదించాలనే ప్రేరణ కలగడానికి? ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన మారుతి-సాయి ధరమ్ తేజ్ అండ్ టీం కు సాధారణ ప్రేక్షకులు అందరూ ఋణపడి ఉండాలి!