రిలీజ్‌లను అడ్డుకునే కొత్త తరహా బ్యాన్‌

Update: 2015-09-03 18:30 GMT
కోలీవుడ్‌ లో కొత్త సంక్షోభం మొదలైంది. రేపటి నుంచి వారం రోజుల పాటు ఏ తమిళ సినిమా కానీ, అనువాద సినిమా కానీ రిలీజ్‌ కాదు. సెప్టెంబర్‌ 4 నుంచి సెప్టెంబర్‌ 11 మధ్య లో ఏ సినిమా రిలీజ్‌ చేయడాని కి వీల్లేదు. అందుకు తమిళ నిర్మాతల సంఘం ఆర్డర్‌ వేసింది. రేపు రిలీజ్‌ కావాల్సిన విశాల్‌ సినిమా పాయుం పులి ఈ వివాదాని కి కారణం. ఈ సినిమాని నిర్మించిన వేంధర్‌ మూవీస్‌ కి, ఎగ్జిబిటర్లకు మధ్య మొదలైన వివాదం చినికి చినికి చివరికి ఇలా సినిమాలన్నిటినీ బ్యాన్‌ చేసేవరకూ వెళ్లింది. ఇది ఎగ్జిబిటర్ల కు, నిర్మాతలకు మధ్య గొడవగా మారింది.

డీప్‌ గా డీటెయిల్స్‌ లోకి వెళితే... చెంగల్‌ పేట్‌ కి చెందిన రోహిణి థియేటర్‌ ఓనర్‌ పనీర్‌ సెల్వం తమిళ సినిమాని నాశనం చేసేలా నిర్మాతల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని, అతడిని ఆపేందుకు ఇలా బ్యాన్‌ విధించామని తమిళ నిర్మాతల సంఘం ఆరోపిస్తోంది. అయితే పనీర్‌ సెల్వం కి ఎగ్జిబిటర్ల సంఘం సపోర్ట్‌ చేస్తోంది. వేంధర్‌ మూవీస్‌ గతం లో రిలీజ్‌ చేసిన 'లింగ'కి సంబంధించి ఆర్థిక వ్యవహారాల్ని సెటిల్‌ చేయాల్సి ఉందని ఎగ్జిబిటర్ల సంఘం వాదిస్తోంది. ఈ గొడవల్లో పడి విశాల్‌ సినిమా ఆగిపోయిందిప్పుడు. గొడవ తేలే వరకూ సినిమాలేవీ రిలీజ్‌ చేయకూడదని నిర్మాతలకు వార్నింగ్‌ ఇచ్చారు. ఏదేమైనా ఇదో తరహా బ్యాన్‌. కొత్త రకం బ్యాన్‌ అన్నమాట. నిర్మాతలే సినిమాను ఆపడం ఏంటండీ బాబూ...
Tags:    

Similar News