2శాతం జనాలు చూస్తేనే 300 కోట్లయితే..

Update: 2015-11-18 17:30 GMT
ఈ ఏడాది ఇండియా టాప్ హిట్ మూవీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్. దేశంలోనే 300 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించాడు సల్లూ భాయ్. ఇంత భారీ కలెక్షన్లు, ఇంత పెద్ద హిట్ అంటే చాలామందే ఈ సినిమా చూసేసి ఉంటారని అనుకోవడం సహజం.

కానీ భజరంగీ మూవీని మనదేశంలో ఎంతమంది చూశారో తెలుసా.. కేవలం వందకు ఇద్దరే. అంటే మన జనాభా 125 కోట్లో కేవల 3 కోట్ల మంది ఈ మూవీని చూశారు. 300కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అదే టీవీలో ప్రదర్శించినపుడు ఏడున్నర కోట్లమంది చూశారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది వందకు ఇద్దరు చూస్తే.. ఇండియా బిగ్గెస్ట్ మూవీ అవుతోంది. మరి ఇంకా ఎక్కువమంది చూస్తే ఏమవుతుంది.. ఇప్పడదే ఆలోచిస్తున్నాయి థియేటర్ల కంపెనీలు. దీనికో పెద్ద లెక్క కూడా చెప్పాయి. మన దేశంలో ప్రతీ పది లక్షల మందికి 7 థియేటర్లు ఉన్నాయని, అదే అమరికాలో అయితే వంద స్క్రీన్ లు ఉంటాయని చెబ్తున్నారు. దేశంలో చాలా చోట్ల సినిమా చూడాలంటే 50 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిన అవసరం కూడా ఉందట. అందుకే ఇంకా చిన్న టౌన్లలోనూ థియేటర్లు కడితే.. బిజినెస్ ఇంకా పెరుగుతుందని లెక్కలేసుకుంటున్నాయి.

నిజానికి ఈ సమస్య ఇంతగా కాకపోయినా మన టాలీవుడ్ కి కూడా ఉంది. బాహుబలి తీసేసి లెక్క కట్టినా మన దగ్గర బిగ్గెస్ట్ హిట్.. శ్రీమంతుడు. దీనికి తెలుగురాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 60 కోట్ల దరిదాపుల్లోనే ఉంది. 10 కోట్ల జనాభా ఉన్న మన  దగ్గర గట్టిగా పదిశాతం మంది కూడా సినిమా చూడట్లేదు. ఒక వేళ చూస్తే.. కోటి మందికి టికెట్ ధర సగటున ఓ వందకోట్లు ఈజీగా వచ్చేయాలి. కానీ ఆ అంకె కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఈ లెక్కన కలెక్షన్స్ పెరగాలంటే.. థియేటర్ల సంఖ్య, అందుబాటు పెరగాలన్ననది సుస్పష్టం.
Tags:    

Similar News