ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ ఏమయ్యాడు ?

Update: 2019-07-05 05:21 GMT
ఇండస్ట్రీలో ఎవరికైనా దిక్సూచి సక్సెసే. అది ఉందా అందరూ వెంటపడి మరీ కొత్త ఎత్తుల వైపు దారి చూపిస్తారు. లేదా అంటే కనీసం ఓ లుక్ వేసే ఆలోచన కూడా చేయరు. ఇది స్టార్ హీరోతో మొదలుకుని చిన్న టెక్నీషియన్ వరకు అందరికి వర్తించేదే. దర్శకుడు మేర్లపాక గాంధీ సైతం కొంచెం ఇంచుమించు ఇలాంటి సిచువేషన్ లోనే ఉన్నాడు. మొదటి సినిమా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ యువ డైరెక్టర్ రెండో మూవీ ఎక్స్ ప్రెస్ రాజాతో శర్వానంద్ తో పాటు తనకూ పెద్ద బ్రేక్ అందించుకున్నాడు.

దీనిలో టేకింగ్ నచ్చే ఏకంగా రామ్ చరణ్ నుంచే పిలుపు వచ్చిందని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది పెండింగ్ లో పెట్టేస్తే సీన్ లోకి నాని వచ్చాడు. రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న డ్యూయల్ రోల్స్ తో తీసిన కృష్ణార్జున యుద్ధం గాంధీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. యావరేజ్ కూడా అనిపించుకోకపోవడం మార్కెట్ పరంగా ఇబ్బందిని కలుగజేసింది.

ఈ కారణంగానే అది వచ్చి ఏడాది అవుతున్నా మేర్లపాక గాంధీ కొత్త సినిమా ఇంకా మొదలుకానే లేదు. బ్రేక్ ఇచ్చిన సంస్థ యూవీలో ఓ ప్రాజెక్ట్ ఉంటుంది అన్నారు కానీ ఆ తర్వాత దాని గురించిన ఊసే లేదు. ఒకవేళ ప్రణాళిక ఏదైనా ఉంటే చిన్న లీక్ అయినా వచ్చి ఉండేది. కానీ ఆ సూచనలు లేవు. మీడియాకు సైతం గాంధీ ఈ మధ్య కనిపించలేదు. ఏదో కొత్త కథను సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నాడని త్వరలో వివరాలు చెబుతాడని సన్నిహితులు అంటున్నారు. చూడాలి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ ఎప్పుడు బయటికి వస్తాడో


Tags:    

Similar News