నందమూరి హీరోలకు రాజకీయాలతో సంబంధం లేదు అంటే ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా ఉండరు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ కీలకమే. నందమూరి కుటుంబంలో పుట్టి సినీ రంగంలో గుర్తింపు సంపాదిస్తే ఆటోమేటిగ్గా రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. ఐతే నందమూరి బాలకృష్ణ వచ్చాక తర్వాతి తరం నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ నేరుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెడతారన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఐతే భవిష్యత్తు సంగతేమో కానీ.. ఇప్పటికైతే వాళ్లు పార్టీ తరఫున ప్రచారం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. తారక్ పదేళ్ల కిందటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఐతే కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటిదాాకా ఆ పని చేయలేదు.
కొన్నేళ్లుగా బాలయ్యతో కళ్యాణ్ రామ్ అంత సన్నిహితంగా లేడు. హరికృష్ణను పూర్తిగా పార్టీ నుంచి దూరం పెట్టడంతో అతను బాలయ్యకు దూరమయ్యాడు. కానీ హరికృష్ణ మరణం తర్వాత సమీకరణాలు మారాయి. బాలయ్యకు కళ్యాణ్ రామ్ క్లోజ్ అయ్యాడు. ‘యన్.టి.ఆర్’ సినిమాలో అతను హరికృష్ణ పాత్రను కూడా పోషించాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కళ్యాణ్ రామ్.. తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వహిస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అందుకు ఎంతమాత్రం సుముఖంగా లేడని స్పష్టమైంది. తన కొత్త సినిమా ‘118’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసి అతను.. తాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయట్లేదని స్పష్టం చేశాడు. తనకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ.. రాజకీయాలపై అంతగా అవగాహన లేదని కళ్యాణ్ చెప్పాడు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం కష్టమని, కాబట్టి తాను ప్రస్తుతానికి రాజకీయాలపై దృష్టి పెట్టట్లేదని అతను తేల్చి చెప్పాడు.