'లూసిఫర్' రీమేక్ గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న టాపిక్. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని.. చరణ్ అందుకే 'లూసిఫర్' రీమేక్ రైట్స్ తీసుకున్నారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రీమేక్ బాధ్యతలు ఏ దర్శకుడి చేతిలో పెడితే బాగుంటుందా.. అని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూవి క్రియేషన్స్ వారు ఈ సినిమాకు దర్శకుడిగా సుజిత్ ను ఎంచుకోవాలని చరణ్ పై ఒత్తిడి తెస్తున్నట్టుగా ఈమధ్య కొన్ని గాసిప్పులు వచ్చాయి. ఇవి నిజంగానే పసలేని రూమర్లని.. చరణ్ పై అటు యు.వి.క్రియేషన్స్ వారు గాని.. విక్రమ్ కానీ ఎటువంటి ప్రెజర్ పెట్టలేదని విశ్వసనీయ సమాచారం అందుతోంది.
ఇంతకీ వాస్తవం ఏంటంటే యువి క్రియేషన్స్ వారు సోలో చిత్రాలు నిర్మించడంతో పాటు ఇతర బ్యానర్ల తో పార్ట్నర్ షిప్ లో కూడా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు ఇప్పటికే జీఏ2 పిక్చర్స్ తో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఇదే రీతిన కొణిదెల పిక్చర్స్ బ్యానర్ భాగస్వామ్యంలో కూడా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రెండు బ్యానర్లు కూడా ఒక అంగీకారానికి వచ్చాయి. అంతే కాదు.. 'సైరా' తో నష్టపోయిన ఎమౌంట్ ను చరణ్ యూవీ వారికి సెటిల్ చేయాల్సి ఉంది. ఇలాంటి కారణాలు యువి క్రియేషన్స్ -కొణిదెల ప్రొడక్షన్స్ జాయింట్ వెంచర్ కు మార్గం సుగమం చేశాయి. అలానే యూవీ వారికి సుజిత్ అగ్రిమెంట్ కూడా ఉండడంతో వారు ఈ రీమేక్ ని డైరెక్ట్ చేసే బాధ్యతను సుజిత్ కు అప్పగించారు.
'సాహో' విషయంలో సుజిత్ పై కొన్ని విమర్శలు ఉన్న మాట నిజమే. అయితే 'సాహో' తెలుగులో హిట్ అవ్వలేదు కానీ ఇండియా వైడ్ బాగానే కలెక్ట్ చేసింది. ఫ్లాప్ వచ్చినప్పటికీ పాన్ ఇండియా సినిమాను హ్యాండిల్ చేసే కెపాసిటీని సుజిత్ సంపాదించుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో 'లూసిఫర్' రీమేక్ ను సుజిత్ చేతిలో పెట్టి పాన్ ఇండియా ఫిలింగా ప్రొజెక్ట్ చేసి 'సైరా' తో సాధించలేని హిట్టును ఈ సినిమాతో సాధించాలని చరణ్ ఫిక్స్ అయ్యాడట. అంతేగాని ఇందులో ఎవరి ప్రెజర్ కూడా లేదని అంటున్నారు. చరణ్ పై ప్రెజర్ లాంటివన్నీ ఉబుసుపోక చెప్పుకునే కబుర్లు తప్ప మరొకటి కాదని అంటున్నారు.