ఇంకో ఆరు రోజుల్లో భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన 2.0 విడుదల కానుంది. తమిళ్ కంటే ఎక్కువగా తెలుగులోనే స్క్రీన్లు కేటాయించడం చూసి చెన్నై మీడియా సైతం ఆశ్చర్యపోతోంది. రజని గత సినిమాల చేదు ఫలితాలను పట్టించుకోకుండా కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న నమ్మకంతో పాటు శంకర్ మేకింగ్ మీద కాన్ఫిడెన్సు తో టాలీవుడ్ నిర్మాతలు ఏకంగా 70 కోట్ల బడ్జెట్ డబ్బింగ్ వెర్షన్ కోసమే పెట్టుబడిగా పెట్టారు. ఎన్ని సానుకూలాంశాలు ఉన్నా ఇలాంటి వాటికి మతులు పోయే ఓపెనింగ్స్ చాలా అవసరం. దానికి దోహదం చేసేది పబ్లిసిటీనే.
ఇక్కడే కాదు ఇతర బాషలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. చెన్నైలో చేసిన ట్రైలర్ రిలీజ్ వేడుక తప్ప ఇంకే ఫంక్షన్ 2.0 టీం చేయలేదు. షూటింగ్ సగంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తో సహా దేశంలోని కీలక నగరాల్లో కనివిని ఎరుగని స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తామని మీడియాకు ఫీలర్లు పంపారు.
తీరా చూస్తే ఇక్కడ ఆర్కే సినీ ప్లెక్స్ లో ఒక పాటతో పాటు అప్పటికే ఆన్ లైన్ లో చూసేసిన ట్రైలర్ ని త్రీడిలో మీడియాకు చూపడం తప్ప ఏమి చేయలేదు. కనీసం రజనికాంత్ ను తీసుకొచ్చి ఇక్కడి స్టార్ లను గెస్ట్ గా పిలిచి ప్రెస్ మీట్ కోసం కూడా ప్రయత్నించలేదు. ఇవన్ని చూస్తే ఓవర్ కాన్ఫిడెన్సా లేక బాహుబలితో పోలిక వస్తోంది కాబట్టి ఎందుకు అవవసరంగా హైప్ తెచ్చుకుని ఇబ్బంది పడటం అనే ఆలోచనా గురువారం తేలిపోతుంది. అసలే రజని ఫ్యాన్స్ బాహుబలిని కొట్టగలిగే సినిమా 2.0 మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం వాళ్ళ నమ్మకం ఎంత వరకు నిలబడుతుందో
కాని 2.0 విషయంలో అంత ఊపైతే కనిపించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్సు బుకింగ్ మాంచి స్వింగ్ లో ఉన్నా ఇది సాధారణంగా క్రేజ్ ఉన్న అందరు స్టార్ హీరోల విషయంలో జరుగుతుంది కాబట్టి షాక్ అయ్యే సీన్ లేదు. కాని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి బాహుబలి ప్లస్ బాహుబలి 2 ప్రీ రిలీజ్ కు ముందు జరిగిన రచ్చను గుర్తుకు తెచ్చుకుంటే అందులో కనీసం సగం కూడా కనిపించకపోవడం విడ్డూరం.