పేరు రోబో చిట్టి - పబ్లిసిటీ మహా పొట్టి

Update: 2018-11-26 06:31 GMT
ఏంటో లైకా సంస్థ స్ట్రాటజీ ఎవరికి అంతుచిక్కడం లేదు. ఆరు వందల కోట్లతో సినిమా తీసాం అని షూటింగ్ జరుగుతున్ననాళ్ళు ఊదరగొట్టిన టీం తీరా విడుదల రోజుల నుంచి గంటల్లోకి మారాక కూడా హడావిడి చేయకుండా మొక్కుబడి ప్రమోషన్లు చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. చెన్నైలో ట్రైలర్ లాంచ్ జరిగినప్పుడు కొందరు తెలుగు మీడియా ప్రతినిధులను పిలిపించడం తప్ప ఇక్కడి వెర్షన్ కు సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేయలేదు. ఏదైనా గ్రాండ్ ఈవెంట్ తో ఇక్కడ సందడి చేస్తారేమో అని ఎదురు చూసిన ప్రేక్షకులకు చివరికి నిరాశే మిగిలింది.

ఈ రోజు సాయంత్రం పార్క్ హయత్ లో ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. రజని అక్షయ్ తో సహా టీం అంతా వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు కాని స్టేజి మీద చూసే దాకా క్లారిటీ రాని పరిస్థితి. ఇదిలా ఉంటే 2.0 మీద ఒక్క తెలుగులోనే 80 కోట్ల దాకా వ్యాపారం జరిగింది. ఓపెనింగ్స్ విషయంలో ఎవరికి అనుమానం లేదు. కాని లాంగ్ వీక్ ఎండ్ ని తనకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే పబ్లిక్ లో ఈ సినిమా ఎలాగైనా చూసి తీరాలి అనే ఫీలింగ్ కలిగించాలి. చాలా ప్లాన్డ్ గా చేసుకున్న మార్కెటింగ్ వల్ల బాహుబలికి రాజమౌళి మతులు పోయే వసూళ్లు రాబట్టుకున్నాడు.

అంతే తప్ప గ్రాఫిక్స్ ఉన్నాయని ప్రచారం చేసినంత మాత్రాన జనం పొలోమని ధియేటర్లకు ఎగబడరు. పైగా 2.0 లో మొదటి భాగం ఛాయలే ఎక్కువగా కనిపిస్తుండటం ఇప్పటికే కొంత మైనస్ గా నిలిచింది. ఇంత కాన్వాస్ ఉన్న సినిమాకు ఇలా సింపుల్ గా ప్రెస్ మీట్లతో సరిపెట్టడం ఏంటని తలైవా ఫ్యాన్స్ నిరాశపడుతున్నప్పటికీ అసలు లైకా ఎత్తుగడ ఏంటి ఎందుకిలా చేసింది అనేది గురువారం ఉదయం తేలిపోతుంది.
   
Tags:    

Similar News