త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత చిత్రం విడుదలైన వెంటనే అల్లు అర్జున్ హీరోగా ఒక చిత్రంను త్రివిక్రమ్ చేయబోతున్నట్లుగా ప్రచారం మొదలైంది. బాలీవుడ్ హిట్ మూవీ సోనూ కీ టీటు కీ స్వీటీ ను రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. అయితే తెలుగు వర్షన్ కు ఒక హీరోను మాత్రమే ఉండబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ రీమేక్ గురించి దాదాపు రెండు మూడు నెలల పాటు ప్రచారం జరిగింది.
ఆ సినిమా రైట్స్ ను ఇచ్చేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ రీమేక్ నిర్మాణంలో భాగస్వామ్యం డిమాండ్ చేసిందని.. త్రివిక్రమ్ రీమేక్ స్క్రీప్ట్ విషయంలో సంతృప్తి చెందలేదని అందుకే కొత్త స్క్రిప్ట్ తో సినిమాను చేసినట్లుగా వార్తలు వచ్చాయి. మొత్తానికి సోనూ కీ టీటు కీ స్వీటీ కాకుండా కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయడం జరిగింది. అదే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ దక్కింది.
అల వైకుంఠపురంలో సినిమా కథ మరియు కథనం ఇలా అన్ని విషయాల్లో కూడా దర్శకుడు త్రివిక్రమ్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది. అదే ఒకవేళ ఆ హిందీ సినిమా రీమేక్ చేసి ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఆ సినిమాను తెలుగు నేటివిటీ కోసం అంటూ మార్పులు చేర్పులు చేస్తే మొదటికే మోసం వచ్చేదేమో.. కొత్త స్క్రిప్ట్ తీసుకుని అల వైకుంఠపురంలో సినిమాను చేయడమే మంచిది అయ్యిందంటూ మెగా ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.