మన దేశంలో సినిమా అంటే ఒక విందు భొజనంలా ఉంటుంది. ఉండాలి. ఎందుకంటే మనకు సినిమా అనేది ఒక వినోదం కాబట్టి. ఆ వినోదంతో మనం అన్నీ మరిచి సినిమా చూసి ఆనందపడుతుంటాం. మనల్ని నవ్వించాలి అప్పుడప్పుడూ ఏడిపించాలి మొత్తంగా చెప్పాలంటే వేరే లోకంలోకి తీసుకొని వెళ్ళాలి. కానీ మనకు ఈ వినోదంలో కూడా కాస్త విరామం కావాలి. ప్రపంచంలో ఎక్కడా విరామం ఉండదు కానీ మన సినిమా స్పెషల్ కాబట్టి మనకు అది అవసరం. అందుకే గంట సినిమా అయ్యాక ఇంటర్వెల్ బ్రేక్ తీసుకుంటాం.
ఇక మన సినిమాలలో ముఖ్యమైంది పాటలు. అసలు ఈ పాటల కోసమే కొంతమంది సినిమాలకు వచ్చేవారు ఉన్నారు. పాటలు లేని విరామం లేని సినిమా ఉంటుందా అలా తీయడం మనం దగ్గర అసలు వీలుపడుతుందా? అని అనుకున్నారంతా. కానీ ఒక తమిళ్ యంగ్ హీరో అవును వీలుపడుతుంది, నా కొత్త సినిమాకు రండి మీకే తెలుస్తుంది అని పిలుస్తున్నాడు. తమిళ్ యూత్ స్టార్ శింబు తన రాబోతున్న తమిళ్ సినిమాలో పాటలు లేకుండా విరామం లేకుండా ఉండబోతుంది అని చెబుతున్నాడు. ఇదే విషయాన్ని తన ట్విటర్ ద్వారా చెప్పాడు. “పాటలు లేవు ఇంటర్వల్ లేదు సినిమాకు వచ్చే ముందే అన్నీ చూసుకొని రండి. తినాలి అనుకున్న ఏదైనా తాగాలి అనుకున్న అన్నీ సినిమా మొదలుకాకముందే చేసుకోండి'' అని చెబుతున్నాడు. సాక్ష్యం లేని వాటిని చూడండి అని చిన్న మెలిక కూడా పెట్టాడు.
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి సినిమాలుకు మొదటిసారి సంగీతం అందిస్తున్నాడు అంటా యువన్ శంకర్. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి అన్నీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలిసి ఉంది. ఇలాంటి మార్కెటింగ్ ఫీట్లు ఈ మద్యన శింబు గట్టిగానే చేస్తున్నాడు కాని.. అసలు సినిమాల్లోనే కంటెంట్ ఉండట్లేదు. మరి ఈ సినిమాలోనైనా ఉందా??