నిర్మాత‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్టు వారెంట్!

Update: 2017-12-20 11:19 GMT
కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో అరెస్టు వారెంట్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే.  టెంప‌ర్ సినిమాకు సంబంధించిన రూ.25 ల‌క్ష‌ల‌ చెక్ బౌన్స్ కేసులో గ‌ణేష్ కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు  6 నెలల జైలు శిక్షతో పాటు రూ.15లక్షల జ‌రిమానా విధించింది. ఆ చెక్ బౌన్స్ కేసు టాలీవుడ్ లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఆ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే తాజాగా మ‌రో నిర్మాత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాడు. సాహ‌సం శ్వాస‌గా సాగిపో - జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డికి చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిల‌బుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది.

ర‌వీంద‌ర్ రెడ్డికి ప‌శ్చిమ‌గోదావ‌రిలోని ప్ర‌త్తిపాడు కోర్టు ఈ అరెస్టు వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో ర‌వీంద‌ర్ రెడ్డికి కోర్టు ప‌లుమార్లు నోటీసులు పంపినా స్పందించ‌లేదు. దీంతో, కోర్టు ధిక్కారం కింద అత‌డికి నాన్ బెయిల‌బుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. ఫిల్మ్ ఫైనాన్స్ కు సంబంధించి ఒక వ్య‌క్తికి ఇచ్చిన‌ రూ.50 ల‌క్ష‌ల చెక్ బౌన్స్ అవ‌డంతో ర‌వీంద‌ర్ రెడ్డిపై కేసు న‌మోదైంది. కొద్ది కాలం వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు నిర్మాత‌ల‌పై చెక్ బౌన్స్ కేసులు న‌మోద‌వ‌డం టాలీవుడ్ ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. సినీ రంగంలో చెక్ బౌన్స్ వివాదాలు త‌ర‌చుగా వ‌స్తూనే ఉంటాయి. అయితే, వాటిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ప‌రిధిలో ప‌రిష్కారం ల‌భించేది. అయితే, ఆ వివాదాలు కొద్ది కాలం నుంచి  కోర్టులు  - అరెస్టు వారెంట్ లు శిక్ష‌లు వ‌ర‌కు వెళ్ల‌డాన్ని టాలీవుడ్ పెద్ద‌లు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News