నోరా ఫతేహి `కూసు కుసు` డ్యాన్సింగ్ వీడియో నెటిజనుల మైండ్ బ్లాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 24 గంటల్లో 22 మిలియన్ల వీక్షణలతో సంచలనం సృష్టించింది ఈ వీడియో. ఈ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేయడానికి రెండు రోజుల్లో 37 గంటల పాటు ప్రత్యేకంగా నోరా ఫతేహిపైనే రకరకాల భంగిమల్లో షాట్లను చిత్రీకరించారని తెలిసింది.
ఇతర ప్రాజెక్టులతో జామ్-ప్యాక్ షెడ్యూళ్లతో బిజీగా ఉన్నా నోరా ఫతేహి సత్యమేవ జయతే 2 లో ప్రత్యేక పాట కుసు కుసు కోసం సమయం కేటాయించింది. ఈ పాటను చిత్రీకరించడానికి నోరాకు కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉండగా .. తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెండు రోజుల్లో దాదాపు 37 గంటల పాటు షూటింగును పూర్తి చేయడం విశేషం. జాన్ అబ్రహం - మిలాప్ జవేరీల కొత్త చిత్రంలో ఈ పాట సంథింగ్ స్పెషల్ అనడంలో సందేహం లేదు.
నోరా తన ఇతర కమిట్ మెంట్ ల కారణంగా షూటింగ్ కోసం చాలా పరిమిత సమయం కేటాయించింది. ఈ పాట కోసం రెండు రోజులు కేటాయించిన నోరా విరామం లేకుండా నిరంతరం షూటింగులో పాల్గొంది. రిజల్ట్ కూడా అదే విధంగా ఆకట్టుకుంది. మొదటి రోజు నోరా 15 గంటలపాటు వరుసగా షాట్ చేసి కొద్దిసేపు విరామం తీసుకుని మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సెట్ కి తిరిగి వచ్చింది. రెండవ చివరి రోజు ఉదయం 5 గంటలకు సెట్లో అడుగుపెట్టింది. దాదాపు 22 గంటల పాటు ఆమెపై షూటింగ్ జరిగింది. ఈలోగా అనేక గాయాలు ఉన్నా.. అలసిపోయినప్పటికీ నోరా షూట్ ను కొనసాగించింది. మళ్లీ రికార్డ్-బ్రేకింగ్ చార్ట్బస్టర్ను అందించింది.. అని చిత్రబృందం తెలిపింది.
దేశంలో నమ్మదగిన నర్తకిగా బహుముఖ ప్రతిభావంతురాలిగా తనదైన ముద్రను వేస్తూ నోరా ఫతేహి తన క్రాఫ్ట్ విషయంలో అత్యంత అంకితభావంతో పని చేస్తోంది. వృత్తి నైపుణ్యం నుంచి ది బెస్ట్ ని మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తోంది. ఇప్పటికే కుసు కుసు ప్రోమో వైరల్ గా దూసుకెళ్లింది. పూర్తి పాట వస్తే మరింతగా రికార్డులు బ్రేక్ చేస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు నోరా ఫతేహి అవాజ్ దర్బార్ తో కలిసి కుసుకుసు ఛాలెంజ్ పేరుతో అద్భుతమైన వీడియోని షేర్ చేసింది. ఇది ఒక కార్ లో చాలా సింపుల్ గా షూట్ చేసినది అయినా ఎంతో క్రియేటివ్ గా ఆకట్టుకుంది. దీనికి నీల్ నితిన్ ముఖేష్ స్పందిస్తూ టెక్నికల్ గా ఎంతో బాగా కుదిరింది అంటూ ప్రశంసించారు.
మీ కార్ లోనే కుసు కుసు ఛాలెంజ్ ని స్వీకరించండి గయ్స్.. మీ ప్రతిభను చూపిస్తూ నాకు ట్యాగ్ చేయండి! ఆటో బైక్ చంద్రమండలం ఎక్కడైనా కుసుకుసు ఛాలెంజ్ లో పాల్గొనొచ్చు అంటూ అల్లరిగా చెప్పుకొచ్యచింది. దీనికి నీల్ నితిన్ స్పందిస్తూ వ్వాటే ఫెంటాస్టిక్ ఎనర్జీ అండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్ అంటూ ప్రశంసించారు.
Full View