బాహుబలి భామ ప్రిన్స్ తో డేటింగ్ చేస్తోంది.. రిలేషన్ లో ఉంది.. త్వరలో పెళ్లి చేసుకుంటారు.. ఇలాంటి రూమర్లను చాలానే విన్నాం చెప్పుకున్నాం. అయితే తెలుగు మీడియాలో ఈ రూమర్లు బాగా ఊపందేసుకుని.. వాటిని మనోళ్లు బాగా ప్రచారం చేసిపాడేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు ట్విస్టు ఏంటంటే.. స్వయంగా బిగ్ బాస్ 9 విన్నర్ ప్రిన్స్ నరులా.. నేను నోరా ఫతేహితో డేటింగ్ చేస్తున్నా అంటూ సెలవిచ్చాడు. కాని అంత సీన్ లేదట.
''ప్రిన్స్ తో రిలేషన్ లో ఉన్నానా?? అసలు డేటింగ్ కూడా చేయట్లేదు నేను. అతను కేవలం ఒక స్నేహితుడు అంతే. మరి నా గురించి డేటింగ్ అంటూ ఎందుకు ప్రచారం చేసుకున్నాడో తెలియదు. అతను రాసిన ప్రేమలేఖకు కాని.. అతని ప్రపోజల్స్ కు కాని నేను స్పందించలేదు. అసలు నాకు అలాంటి ఉద్దేశ్యమే లేదు. బిగ్ బాస్ హౌస్ లో మేము కేవలం పార్టనర్సే కాని.. అంతకుమించి ఇంకేం లేదు'' అంటూ తేల్చేసింది నోరా. అదేంటమ్మా మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అంటే..
''దయచేసి అలాంటి బూతులు మాట్లాడకండి. నేను ఇప్పటకీ సింగిల్. ఒకవేళ ప్రిన్స్ తో డేటింగ్ చేస్తుంటే.. ఆ విషయం నేనే స్వయంగా ముందు ప్రకటించేస్తాను. దానిలో పెద్దగా దాచుకునేది ఏముంటుంది?'' అనేసింది ఈ మనోహరి.