ఆ హీరోయిన్ కోసం బోలెడు డౌట్లు

Update: 2018-06-15 10:09 GMT
తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏమిటో గాని గత కొంత కాలంగా అస్సలు అర్ధం కావడం లేదు. ఏ సినిమా ఇండస్ట్రీలో లేనట్టుగా ఊహించని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. గత ఏడాది డ్రగ్స్ వివాదం నుంచి నిన్న శ్రీ రెడ్డి ఇష్యు వరకు అన్ని మచ్చ తెచ్చాయనే చెప్పాలి. బాహుబలి లాంటి గొప్ప సినిమాలతో టాలీవుడ్ స్థాయిని పెంచుతుంటే ఇలాంటి ఘటనలు పరిశ్రమకు నెగిటివ్ కామెంట్స్ ను అందిస్తున్నాయి.  ఇక ఇప్పుడు యూఎస్ కి కూడా పాకింది.

సెక్స్ స్కాండల్ అనే నెగిటివ్ కామెంట్ ఎక్కువగా వినిపిస్తోంది. యూఎస్ కి టాలీవుడ్ కి మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రవాసులు ఎక్కువగా ఉండడంతో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల అమెరికా పోలీసులు ఓ హీరోయిన్ ఏ విక్టమ్ అంటూ టాలీవుడ్ పై అనుమానాలను రేపారు. వివిధ కార్యక్రమాల పేరుతో సాధారణంగా హీరోయిన్స్ అమెరికాకు వెళుతుండడం కామన్ . అయితే కొందరు సెక్స్ రాకెట్ నడిపించేందుకు ఆ తరహాలో తీసుకువస్తున్నారని అక్కడి పోలీసులు కేసు ఫైల్ చేశారు.

దీంతో ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరా అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు అమెరికా వెళ్ళిన హీరోయిన్స్ అలాగే తిరిగి వస్తున్న నటీమణుల పై కూడా డౌట్ పడే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో కాస్త పేరు బయటకు వచ్చినా ఇప్పుడు వైరల్ అయ్యే అవకాశం ఉంది. విక్టమ్ ఏ అనే ఆ నటీమణి ఎవరో తెలియక ఇతర హీరోయిన్స్ పై మచ్చ తెచ్చే ప్రమాదం ఉంది. అయితే ఆమె ఎవరో చెబితే మిగాతా వారు సేఫ్ జోన్ లో ఉంటారు కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.  
Tags:    

Similar News