విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అమెరికాలో ప్రీమియర్ షోస్ కలెక్షన్ కూడా అప్పుడే బయటకు వచ్చాయి. 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన రెండు నెలల గ్యాప్ లోనే 'నోటా' రిలీజ్ కావడంతో భారీ సంఖ్యలో ప్రీమియర్స్ పడ్డాయి. 220 కంటే పైగా స్క్రీన్స్ లో ప్రీమియర్స్ షోస్ ప్రదర్శించడం అనేది విజయ్ కెరీర్లో ఒక రికార్డ్. మరి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉన్నాయి?
తెలుగు - తమిళ వెర్షన్స్ కలిపి $188995 కలెక్షన్స్ సాధించింది. విజయ్ లాస్ట్ సినిమా 'గీత గోవిందం' ప్రీమియర్స్ కలెక్షన్స్ $403442. అది కూడా 158 స్క్రీన్స్ నుండి మాత్రమే. అంటే 'గీత గోవిందం' ప్రీమియర్స్ కలెక్షన్స్ తో పోలిస్తే సగం కంటే తక్కువ. 'నోటా' సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ కావడం.. పైగా ప్రమోస్.. సాంగ్స్ చూసినవారికి ఇది తెలుగు సినిమాలా కాకుండా తమిళ సినిమాలా ఉంటుందనే ఫీల్ కలగడంతో రెస్పాన్స్ తక్కువగా ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక తెలుగు వెర్షన్ కు యావరేజ్.. డల్ రివ్యూస్ వచ్చాయి గానీ తమిళ క్రిటిక్స్ మాత్రం 'నోటా' కు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మరి విజయ్ దేవరకొండ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మొదటి వీకెండ్ కలెక్షన్స్ వచ్చే వరకూ ఆగాలి.