విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘నోటా’కు తొలి రోజు ఆశించిన టాక్ రాలేదు. మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. ఐతే ఈ టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయింది. ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలుండటం.. ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే ఉన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ‘నోటా’ తెలుగు.. తమిళ భాషల్లో రిలీజవగా.. తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.7.3 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ‘గీత గోవిందం’కు రూ.10 కోట్ల దాకా షేర్ వచ్చింది. ఐతే ఆ చిత్రానికి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రిలీజ్ చేసిన థియేటర్లు కూడా ఎక్కువ. ‘నోటా’ను దాంతో పోలిస్తే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. పైగా డివైడ్ టాక్ వచ్చింది. అయినా ఇంతటి వసూళ్లు రావడం గొప్ప విషయమే. విజయ్ స్టార్ పవర్ ను చాటిచెప్పే వసూళ్లివి. ఐతే వీకెండ్ అంతా సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో.. ఆ తర్వాత సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఏరియాల వారీగా తొలి రోజు ‘నోటా’ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..
నైజాం- రూ.1.93 కోట్లు
సీడెడ్- రూ.63 లక్షలు
వైజాగ్- రూ.51 లక్షలు
తూర్పు గోదావరి- రూ.33 లక్షలు
పశ్చిమ గోదావరి- రూ.23 లక్షలు
కృష్ణా- రూ.30 లక్షలు
గుంటూరు- రూ.42 లక్షలు
నెల్లూరు- రూ.20 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.4.55 కోట్లు
కర్ణాటక- రూ. 60 లక్షలు
తమిళనాడు- రూ.1 కోటి
యుఎస్- రూ.75 లక్షలు
మిగతా ఏరియాల్లో- రూ.45 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్- రూ.7.3 కోట్లు
ఏరియాల వారీగా తొలి రోజు ‘నోటా’ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..
నైజాం- రూ.1.93 కోట్లు
సీడెడ్- రూ.63 లక్షలు
వైజాగ్- రూ.51 లక్షలు
తూర్పు గోదావరి- రూ.33 లక్షలు
పశ్చిమ గోదావరి- రూ.23 లక్షలు
కృష్ణా- రూ.30 లక్షలు
గుంటూరు- రూ.42 లక్షలు
నెల్లూరు- రూ.20 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.4.55 కోట్లు
కర్ణాటక- రూ. 60 లక్షలు
తమిళనాడు- రూ.1 కోటి
యుఎస్- రూ.75 లక్షలు
మిగతా ఏరియాల్లో- రూ.45 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్- రూ.7.3 కోట్లు