యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని.. పాన్ ఇండియా క్రేజ్ ని కాపాడుకునేలా పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.
ఇందులో భాగంగా విభిన్నమైన జోనర్స్ లో సరికొత్త కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. డార్లింగ్ లైనప్ లో ప్రస్తుతం ఓ మైథలాజికల్ - యాక్షన్ డ్రామా - సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ - హారర్ కామెడీ వంటి వేటికవే ప్రత్యేకమైన జోనర్లలో సినిమాలు ఉన్నాయి.
ప్రభాస్ కెరీర్ ప్రారంభం నుంచీ కమర్షియల్ హీరోగానే కొనసాగుతున్నప్పటికీ.. మధ్యలో 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి కుటుంబ ప్రేమకథా చిత్రాలు కూడా చేసారు. అయితే 'బాహుబలి' సిరీస్ తర్వాత అమాంతం పెరిగిన క్రేజ్ తో.. ప్రభాస్ నుంచి అదే స్థాయిలో సినిమాలు ఆశించే పరిస్థితి ఏర్పడింది.
'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో'.. లేటెస్టుగా వచ్చిన 'రాధేశ్యామ్' సినిమాలు మెజారిటీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచకపోవడానికి ఓ రకంగా కారణం కూడా అదే అనేవారు లేకపోలేదు. అందుకే కొత్త కథలతో క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ చూపించినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అంటున్నారు.
సినిమాల పరంగా డివైడ్ టాక్ వచ్చినా ప్రభాస్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెయినింగ్స్ రావడానికి కారణం 'బాహుబలి' తో వచ్చిన భారీ క్రేజ్ అనే కామెంట్స్ వస్తున్నాయి. 'సాహో' సినిమా నార్త్ బెల్ట్ లో మంచి కలెక్షన్స్ అందుకోగా.. తెలుగులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
రీసెంట్ గా 'రాధే శ్యామ్' వంటి పీరియాడికల్ లవ్ స్టోరీతో వచ్చినా.. స్క్రీన్ ప్లే మరియు భావోద్వేగాలు ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు. భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్ లో రిలీజైన ఈ సినిమా.. అన్నీ భాషల్లోనూ ఒకే విధమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
అందుకే ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోతున్న తదుపరి పాన్ ఇండియా సినిమాల గురించి డార్లింగ్ ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న 'ఆదిపురుష్' చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ సరికొత్త అవతార్ లో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే 'స్పిరిట్' మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారు.
నాగ్ అశ్విన్ తో చేస్తున్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో సూపర్ హీరో తరహా పాత్రలో సరికొత్త గెటప్ లో ప్రభాస్ నటిస్తున్నారని టాక్. ఇక మారుతితో చేయబోయే ప్రాజెక్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుందని అంటున్నారు. ఇలా వేటికవే ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ను ఎంచుకుంటున్నారు ప్రభాస్.
'బాహుబలి' తర్వాత డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తున్నప్పటికీ.. స్టోరీ - స్క్రీన్ ప్లే విషయంలో కాస్త కేర్ తీసుకుంటే గ్లోబల్ స్టార్ ఇమేజ్ రెట్టింపు అవుతుందని డార్లింగ్ ఫాన్స్ భావిస్తున్నారు. 'సాహో' 'రాధేశ్యామ్' సినిమాల రిజల్ట్ తో ప్రభాస్ కూడా ఎంతో కొంత నేర్చుకోవాలని వారు కోరుకుంటున్నారు.