#NS22 వర్కింగ్ స్టిల్.. బ్రహ్మాజీని తమ్ముడిగా సంబోధిస్తూ శౌర్య ఫన్నీ పోస్ట్..!

Update: 2021-07-23 05:36 GMT
యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హీరోహీరోయిన్లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని హిలేరియస్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. హీరో శౌర్య తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో #NS22 వర్కింగ్ స్టిల్ షేర్ చేశారు.

సీనియర్ నటుడు బ్రహ్మాజీ తో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేసిన నాగశౌర్య.. ఫన్నీ కామెంట్ పెట్టాడు. “నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యంగ్ టాలెంట్ ని సపోర్ట్ ఇవ్వండి. #IRA4 #NS22” అని ట్వీట్ చేశారు. బ్రహ్మాజీ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పడానికి తమాషాగా తమ్ముడిగా శౌర్య సంబోధించినట్లు అర్థం అవుతోంది. ఈ ఫొటోలో నాగ శౌర్య - బ్రహ్మాజీ ఇద్దరూ నామాలు పెట్టుకొని పంచె కట్టులో ఉన్నారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయని తెలుస్తోంది.

నాగ శౌర్య మునుపటి సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నంగా.. #NS22 లో పూర్తి వినోదభరితమైన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రామ్‌ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News