క్యారెక్ట‌ర్ కోసం రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్‌!

Update: 2022-07-01 03:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ `RRR`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంల‌చ‌నాలు సృష్టించింది. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం బీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించారు. గ‌త కొంత కాలంగా వ‌రుసగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

రీసెంట్ గా ప్ర‌ముఖ‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్ తో రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం దాదాపు మూడేళ్లు కేటాయించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసిన వెంట‌నే మ‌రో ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ అది ఇంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌డం లేదు.

`RRR` త‌రువాత ఎన్టీఆర్ వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ  డైరెక్ష‌న్ తో త‌న 30వ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌నుకున్నారు. కానీ స్క్రిప్ట్ ఫైన‌ల్ కాక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం లేద‌ని, అంతే కాకుండా మ‌రో రెండు నెల‌ల పాటు మంచి ముహూర్తాలు లేక‌పోవ‌డం కూడా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌డానికి ఆల‌స్యం అవుతోంద‌ని చెబుతున్నారు.

ఎన్టీఆర్ ప్లాన్ ప్ర‌కారం ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో సెట్స్ పైకి రావాల్సి వుంది. అదీ జ‌ర‌గ‌లేదు. కొర‌టాల శివ `ఆచార్య‌` ప‌నుల్లో బిజీగా వుండ‌టం వ‌ల్ల సాధ్య‌ప‌డ‌లేదు. ఇక ఇటీవ‌ల డైలాగ్ మోష‌న్ టీజ‌ర్ ని విడుద‌ల చేసిన త‌రువాత అయినా అంటూ జూలైలో అయినా ముహూర్తం జ‌రిపి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మేకోవ‌ర్ కోసం భారీగా త‌గ్గ‌బోతున్నార‌ట‌. ఇందు కోసం ప్ర‌త్యేకంగా వ‌ర్క‌వుట్ లు మొద‌లు పెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కు దాదాపు రెండు నెల‌ల స‌మ‌యం వుండ‌టంతో మేకోవ‌ర్ కోసం భారీ స్థాయ‌లో క‌స‌ర‌త్తులు చేయ‌బోతున్నార‌ట‌.

8 నుంచి 9 కిలోల వ‌ర‌కు ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం త‌గ్గ‌బోతున్నార‌ని తెలిసింది. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైతే ఈ మూవీని వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశాలు వున్నాయ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News