2013 లో వచ్చిన విశ్వరూపం సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో విశ్వరూపం 2 చేశాడు. ఆ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా కమల్ అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. సినిమా 2015 మొదలైనా కూడా అప్పటి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటు వస్తోంది.
ఫైనల్ గా కమల్ అన్ని ఫార్మాలిటీస్ ని ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. తెలుగు తమిళ్ హిందీ లో భాషల్లో స్టార్ నటీనటులతో సినిమా ట్రైలర్ ను కమల్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు మొదట జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగులో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక తమిళ్ లో శృతి హసన్ విడుదల చేస్తుండగా అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హిందీలో రిలీజ్ చేయనున్నారు. కమల్ హసన్ అందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు.
ఇక విశ్వరూపం 2 లో రాహుల్ బోసే - పూజా కుమార్ అలాగే ఆండ్రియా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి పార్ట్ బాగా కాంట్రోవర్శీ అయ్యింది కాబట్టి.. రెండో పార్ట్ కూడా అదే రేంజులో కాంట్రోవర్శీ అయితే మాత్రం.. కమల్ హాసన్ పంట పండినట్లే. కాని ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి.. సినిమాలో ఏ కాంట్రోవర్శీ వచ్చినా కూడా అది రాజకీయంగా ఆయనకు మైనస్ అయ్యే ఛాన్సుంది.