వినాయ‌క చ‌వితికి నంద‌మూరి ట్రీట్‌

Update: 2015-09-12 19:30 GMT
ఇది నంద‌మూరి నామ సంవ‌త్స‌రం అని డిక్లేర్ చేసేశారు ఫ్యాన్స్‌. నంద‌మూరి అభిమానులు ఈ ఏడాది ఆరంభ‌మే సంబ‌రాలు మొద‌లెట్టేశారు. ప్రారంభ‌మే క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన ప‌టాస్ పెద్ద స‌క్సెసైంది. ఆ వెంట‌నే ఎన్టీఆర్ హీరోగా న‌టించిన టెoపర్  పెద్ద విజ‌యం అందుకుంది. బాల‌య్య‌బాబు మిస్స‌య్యాడు కానీ నంద‌మూరి అభిమానుల‌కు రెండు వ‌రుస‌ విజ‌యాల్ని కానుక‌గా ఇచ్చారు బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ. ఇప్పుడు అదే హుషారులో మ‌రోసారి డ‌బుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇద్ద‌రూ...

క‌ళ్యాణ్ రామ్ న‌టించిన షేర్‌, ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న నాన్న‌కు ప్రేమ‌తో రేసులో ఉన్నాయిప్పుడు. ఇవి రెండూ ఫ్యాన్స్‌ కి పండ‌గ తెచ్చేవే. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్ లు ఈపాటికే రిలీజైపోయాయి. అభిమానుల్లో పాజిటివ్ టాక్ వినిపించింది. ముఖ్యంగా క‌ళ్యాణ్‌ రామ్ మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత స్ట‌యిలిష్‌ గా క‌నిపించాడు ఈ లుక్‌ లో. అలాగే ఎన్టీఆర్ పూర్తిగా గెట‌ప్‌ నే చేంజ్ చేసి అద‌ర‌గొట్టేశాడ‌న్న టాక్ వ‌చ్చింది. ఇంట‌ర్‌ పోల్ ఆఫీస‌ర్‌ గా కొత్త‌లుక్‌ లో ట్రీట్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన టీజ‌ర్‌ లు ఈ వినాయ‌క చ‌వితికి వ‌చ్చేస్తున్నాయి.

విఘ్న‌వినాయ‌కుని చ‌తుర్ధి రోజున ఇదో విజుల‌వ్ ట్రీట్ అవుతుంద‌నే నంద‌మూరి అభిమానులు భావిస్తున్నారు. ప‌టాప్ విజ‌యంతో క‌ళ్యాణ్‌ రామ్ రెట్టించిన ఉత్సాహంతో క‌నిపిస్తున్నాడు. అలాగే టెంప‌ర్‌ తో మ‌రోసారి పుంజుకున్నాడు కాబ‌ట్టి ఎన్టీఆర్ అంతే ఊపులో ఉన్నాడు. కాబ‌ట్టి వినాయ‌కుని పండ‌క్కి విజువ‌ల్ ట్రీట్ షురూ అయిపోయింది.
Tags:    

Similar News