తెలుగు ఇండస్ర్టీలో ఏ సినిమా ప్లానింగ్ ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం. ఇప్పటివరకు అలా ప్లానింగ్ తో ముహూర్తం ఈవెంట్ నాడే రిలీజ్ డేట్ చెప్పేసి.. అదే డేటుకు రిలీజైన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయ్. బాలీవుడ్ లో అయితే కంటిన్యూస్ గా ఇదే పద్దతి. ఒకసారి లాకైన రిలీజ్ డేట్ మార్చాలంటే అక్కడ పెద్ద తతంగమే ఉంటుంది.
అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాను ఆగమేఘాలమేద పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్చి 24న లేదా 29న ఈ సినిమా వస్తుందనే విషయంపైనే ఇంకా క్లారిటీ లేదు. అయితే మనోడు ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ డైరక్షన్లో చేసే సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని ఇప్పుడు ఒక డేట్ వచ్చేసింది. అదే విధంగా బాబీ డైరక్షన్లో జూ.ఎన్టీఆర్ ఒక సినిమాను చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు యంగ్ టైగర్. కాని ఈ సినిమాను కూడా ఆగస్టు 11నే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు మరో వార్త వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ అసలు ఏ సినిమా తరువాత ఏ సినిమా మొదలెడతాడో తెలియదు. ముహూర్తం షాటు కొట్టించుకొని ఆల్రెడీ రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఇంతవరకు షూటింగులోనే జాయిన్ అవ్వలేదు. అలాంటప్పుడు ఈ రిలీజ్ డేట్ అప్పుడే కైసా ఆగయా?? చూద్దాం ఈ డేట్ ఎంతవరకు నిజమవుతుందో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/