పవన్ వర్సెస్ ఎన్టీఆర్.. పోటీ ఖాయమేనా?

Update: 2017-01-21 10:11 GMT
మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణలు సంక్రాంతి రేస్ లో పోటీ పడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరూ నెగ్గారనే అనాలి. పక్కా కమర్షియల్ ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ ప్రభంజనం సృష్టిస్తే.. చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీ.. బాలయ్య కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

మెగా వర్సెస్ నందమూరి పోటీ ఇదే ఏడాది మరోసారి ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్-ఎన్టీఆర్ లు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాటమరాయుడు పూర్తి చేస్తున్న పవన్.. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టనున్నాడు. మరోవైపు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఫిబ్రవరి 11న ప్రారంభం కానుంది. పవన్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ రెండు సినిమాలు ఒకే డేట్ ని రిలీజ్ కి టార్గెట్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఆగస్ట్ 11 తేదీని టార్గెట్ చేసి పవన్.. ఎన్టీఆర్ లు తమ సినిమాల రిలీజ్ కి ఫిక్స్ అయ్యారట. ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్న బాబీ దగ్గర.. ఇటు పవన్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ దగ్గర.. బౌండ్ స్క్రిప్ట్ ఉండడంతో జూలై చివరకు ఫినిష్ చేయడం అంత కష్టం కాదని తెలుస్తోంది. ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి మెగా వర్సెస్ నందమూరి పోటీని ఎంజాయ్ చేసిన అభిమానులు.. ఇండిపెండెన్స్ డేకి మరోసారి ఇదే రేస్ ని చూసే ఛాన్స్ ఉందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News