1 మిలియన్: వీరరాఘవుడి విధ్వంసం స్టార్ట్!

Update: 2018-10-12 05:08 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇక ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా బుధవారం నాడే ప్రీమియర్స్ పడ్డాయి.  ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఓవర్సీస్ లో భారీ ఆసక్తి వ్యక్తమయింది.  ప్రీమియర్స్ తోనే $797366 సాధించిన 'అరవింద సమేత' గురువారం నాడు మరో $208721 కలెక్షన్స్ రిజిస్టర్ చేసి వన్ మిలియన్ ( $1006087 ) మార్క్ ను దాటేసింది.

ఈ కలెక్షన్స్ ఫిగర్స్ గురువారం 10.45 pm ESTవరకూ 189 లోకేషన్స్ నుండి మాత్రమే వచ్చినవి. ఇంకా గురువారం నాటి ఫైనల్ కలెక్షన్స్ వివరాలు అందాల్సి ఉంది. వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడంతో ఎన్టీఆర్ కు ఇది ఆరోసారి.   అంతే కాదు టాలీవుడ్ లో ఇప్పటివరకూ వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో  'అరవింద సమేత' 44వది.  పాజిటివ్ టాక్.. లాంగ్ వీకెండ్ లాంటివి ప్లస్ లు ఉండడంతో ఈ వారంతంలోనే $2 మిలియన్ డాలర్ చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా 'అరవింద సమేత' జోరు మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్ అంతా దాదాపుగా అడ్వాన్సు బుకింగ్స్ ఫుల్ కావడంతో భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.  మరి కొన్ని గంటల్లోనే మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు బయటకు వస్తాయి. అప్పుడు గానీ వీర రాఘవుడి విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో మనకు తెలియదు.
Tags:    

Similar News