ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టెంపర్ - నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ - జై లవకుశ ... ఇలా అప్రతిహతంగా జైత్ర యాత్ర సాగిస్తున్నాడు. తారక్ విల్‌పవర్‌తో ఈ సక్సెస్ అతడి పాదాక్రాంతం అవుతోంది. అందుకే అతడి సినిమా సెట్స్ కెళుతోంది అంటే బిజినెస్ వర్గాల్లో చాలా ముందే భారీ అంచనాలేర్పడుతున్నాయి. ఏరియా వైజ్ ఎంత ధర అయినా వెనకాడకుండా హక్కులు కొనుక్కునేందుకు బయ్యర్లు ముందుకొస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోని `అరవింద సమేత` బిజినెస్ వర్గాల్లో అంతే వేడి పెంచుతోంది. ఈ సినిమా సీడెడ్ హక్కుల్లో టాప్ 4 పొజిషన్ ని కైవశం చేసుకుంది.
ఇప్పటివరకూ సీడెడ్ రికార్డులు వెతికితే.. బాహుబలి2 - 25 కోట్లు - పవన్ అజ్ఞతావాసి 16.20 కోట్లు - చరణ్ 12- 15.40 కోట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో `అరవింద సమేత` 15 కోట్లతో టాప్ 4లో నిలిచింది. అయితే ఈ సినిమాకి ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం లేకపోలేదు. ఇది పక్కాగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి వసూళ్లకు కొదవేం ఉండదన్న అంచనాతో ఆ మేరకు అక్కడ ప్రీ రిలీజ్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది.
దీంతో హారిక & హాసిని సంస్థ ఈ సినిమాని ఏ ఒక్కరికో ఓవరాల్ హక్కులు కట్టబెట్టకుండా - జిల్లాల వారీగా డివైడ్ చేసి మరీ సేల్ చేసిందిట. పబ్లిసిటీతో పాటు ప్రింట్ ఖర్చులు కలుపుకుని 15కోట్లకు కిట్టుబాటు అయ్యేలా ఒప్పందాలు చేసుకుందిట. అంటే 15-20 కోట్ల మేర షేర్ సీడెడ్ నుంచి వసూలైతే పంపిణీదారులు సేఫ్ అయినట్టు. అంత వసూలు చేయాలంటే అరవింద సమేత తొలి రోజు బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ రావాల్సిందే. ఇకపోతే వసూళ్ల రికార్డులు పరిశీలిస్తే ఇప్పటివరకూ బాహుబలి 1 - ఖైదీనంబర్ 150 - బాహుబలి 2 - రంగస్థలం చిత్రాలు మాత్రమే సీడెడ్ లో 15 కోట్ల షేర్ వసూలు చేయగలిగాయి. ఇతర సినిమాలేవీ ఆ దరిదాపుల్లోనే లేవు.