'అరవింద సమేత' సినిమా అనౌన్స్ చేసినప్పుడున్న ఉత్సాహం 'అజ్ఞాతవాసి' రిలీజ్ తరవాత లేదన్నది వాస్తవం. త్రివిక్రమ్ అలాంటి సినిమా కూడా తీయగలడా అని ప్రేక్షకులు కాస్త జడుసుకున్న సందర్భం అది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఏమాత్రం తొణకక బెణకక గురూజీమీద నమ్మకం ఉంచాడు. స్లోగా ఫస్ట్ లుక్.. ఇతర పోస్టర్స్.. టీజర్.. ట్రైలర్.. పాటలు రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ సినిమాపై క్రేజ్ పీక్స్ లోకి వెళ్ళింది.
ఇక సినిమా థియేట్రికల్ రైట్స్ లెక్క మాత్రమే 90 కోట్లు దాటిందంటే.. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమానుండి బయటకొచ్చిన మరో పోస్టర్ కేక పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో ఎన్టీఆర్ కత్తి చేతబట్టి శత్రువులను కోత కోసేందుకు నడుస్తూ వెళ్తున్నాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఉండే పెద్ద చెట్టు ఈ పోస్టర్ లో మరో హైలైట్. ఇక సీమ యువకుడు వీరరాఘవుడి అవతారంలో ఎన్టీఆర్ ను ఇలా చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలు రాకుండా ఉంటాయా..?
సినిమా విడుదల కు ఇక వారం రోజులు కూడా లేదు. దీంతో ఇప్పటికే కౌంట్ డౌన్ బిగిన్ అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తారక్ కెరీర్లో హయ్యెస్ట్ అయినట్టే కలెక్షన్స్ కూడా తారక్ కెరీర్ బెస్ట్ అవుతాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి గురూజీ ఆ నమ్మకం నిలబెట్టుకుంటాడో వేచి చూడాలి.