వస్తాడు వీర రాఘవుడు ఆరోజు.. పక్కాగా

Update: 2018-09-28 05:26 GMT
'అరవింద సమేత' రిలీజ్ డేట్ ఒక ఓపెన్ సీక్రెట్.. అక్టోబర్ 11.  కానీ అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్ వేస్తేనే దానిని మనం ఖచ్చితం అనుకోవాలి. అసలే రిలీజ్ డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు 'అరవింద సమేత' టీమ్ కిందా మీద అయిపోతున్నారని వార్తలు వస్తున్నాయి కాబట్టి అభిమానుల్లో మాత్రం సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా వాయిదా పడుతుందా అని కాస్త ఆందోళన ఉంది.  అలాంటి అనుమానాలను పూర్తిగా దూరం చేస్తూ 'అరవింద సమేత' విడుదల తేదీని ప్రకటించారు.

అందరూ అనుకున్నట్టుగానే అక్టోబర్ 11 న ఎన్టీఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ పోస్టర్ లో ఎన్టీఆర్ -  పూజా హెగ్డే ఒక హోటల్ లో కూర్చుని ఉన్నారు. ఇక యంగ్ టైగర్ తన మొహానికి ఎడమ చెయ్యి అడ్డం పెట్టుకుని చిలిపిగా ఓ స్మైల్ ఇస్తున్నాడు. పక్కన పూజా అలా పైకి చూస్తూస్తూ ఉంది.. మరి సీమ గురువుగారు ఫ్రేమ్ బయట ఏదైనా రచ్చ చేస్తున్నారేమో!

ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  థమన్ ఆడియో పూర్తిగా చార్ట్ బస్టర్ కానప్పటికీ సినిమా హై ఎమోషన్లో సాగుతుందనే హింట్ మాత్రం ఇచ్చింది. ఎవరెన్ని చెప్పినా ఎన్టీఆర్ కోర్  స్ట్రెంగ్త్  ఎమోషన్ సీన్స్.  సింహాద్రి అయినా రాఖీ అయినా టెంపర్ అయినా ఎమోషన్ సీన్ ఉంటే ఎన్టీఆర్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళతాడు.  గురూజీ దానిపైనే స్టొరీ రన్ చేసినట్టుగా ఉన్నాడని కొందరు అంటున్నారు.
Tags:    

Similar News