యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా తారక్ కు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.
ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో నందమూరి హీరో తదుపరి సినిమాపై అందరి దృష్టి పడింది. తారక్ సైతం RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో.. అలాంటి చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఇది అగ్ర హీరో కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం. ఇదొక రివేంజ్ డ్రామా అని ఇప్పటికే ధ్రువీకరించారు. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబడిన ఈ సినిమాని జూన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారని.. సుమారు 8 కిలోలు బరువు తగ్గించే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ పాపులర్ వెబ్ పోర్టల్ ఇంటర్వ్యూలో #NTR30 ప్రాజెక్ట్ పై తారక్ స్పందించారు. ఇది అన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఇంటెన్స్ డ్రామా అని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ డ్రామాతో పాటు అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు.
"ఇది డ్రామాతో నిండి ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఏకం చేసేది డ్రామా అని నేను నమ్ముతాను. ఇందులో ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజం కూడా ఉంటుంది. RRR తర్వాత అభిమానులు మరియు ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి'' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న #NTR30 సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. RRR సినిమాతో తారక్ కు ఏర్పడిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేసే అవకాశం ఉంది. ఈసారి రిపేర్లు సరిహద్దులు దాటబోతున్నాయంటూ కొరటాల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. అలానే అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. త్వరలోనే ప్రధాన నటీనటులు - సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. NTR30 మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.