మరోసారి అన్న కోసం ఎన్టీఆర్‌

Update: 2019-02-21 14:44 GMT
ఈమద్య కాలంలో నందమూరి బ్రదర్స్‌ ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌ ల మద్య సన్నిహిత్యం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అన్న కళ్యాణ్‌ రామ్‌ సినీ వేడుకలకు ఎన్టీఆర్‌ రావడం సర్వ సాదారణం అయ్యింది. ఏదైనా ప్రత్యేక సందర్బంలో తప్ప గత రెండేళ్లుగా అన్న ఎన్టీఆర్‌ ప్రతి సినిమా కార్యక్రమానికి వెళ్లడం, ఆయన్ను ప్రమోట్‌ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేయడం చేస్తూ వస్తున్నాడు. మరోసారి అన్న కళ్యాణ్‌ రామ్‌ కోసం ఎన్టీఆర్‌ రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ '118' చిత్రంలో నటిస్తున్నాడు. షాలిని పాండే - నివేత థామస్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌ సభ్యులు మరో వారం రోజుల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ వేడుక నిర్వహించాల్సి ఉన్నా కూడా ఎన్టీఆర్‌ విదేశాలకు వెళ్లిన కారణంగా ఆయన వచ్చే వరకు వెయిట్‌ చేశారట.

ఎన్టీఆర్‌ ఇటీవలే విదేశాల నుండి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే రాజమౌళి మూవీ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్‌ డేట్‌ ను తీసుకుని - ఆయనకు అనుగుణంగా ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే '118' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ మరోసారి అన్న కళ్యాణ్‌ రామ్‌ కోసం రావడంతో 118 చిత్రంకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంది. పబ్లిసిటీ అయితే వస్తుంది కాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News