నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో సినిమా అంటూ బాలకృష్ణ ప్రకటించగానే ఆయన్ను మరిపించగల సత్తా బాలయ్యకు ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన జీవితాన్ని సినిమాలో చూపించడం సాధ్యం కాదని కొందరు అనుకున్నారు. కాని దర్శకుడు క్రిష్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘ఎన్టీఆర్’ మూవీ ట్రైలర్ విడుదల తర్వాత జనాలు పెట్టుకున్న నమ్మకంకు క్రిష్ పూర్తి న్యాయం చేయగలిగాడు అనిపిస్తుంది.
ఇప్పటి వరకు ‘ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్ లను విడుదల చేశారు. ఆ పోస్టర్స్ లో ఎన్టీఆర్ ను బాలయ్య దించేశాడు అంటూ అంతా అనుకున్నారు. అయితే కొందరు మాత్రం ఫొటో షాప్ మ్యాజిక్ అని, కెమెరా ట్రిక్స్ అంటూ ఏదో కామెంట్స్ చేశారు. తాజాగా ట్రైలర్ లో ఎన్టీఆర్ గా బాలయ్యను చూసిన వారు అంతా కూడా నోరు మూసుకోవాల్సిందే. నిజంగా ఎన్టీఆర్ ను దించేశాడు. దర్శకుడు క్రిష్ మరియు బాలకృష్ణలు పడ్డ కష్ట, చూపిన తాపత్రయం ఈ ట్రైలర్ లో క్లీయర్ గా కనిపించింది.
ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లక ముందు నుండి ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. మొదటి నుండి అంటున్నట్లుగానే బసవతారకం పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్స్ నటించారు. అయితే ట్రైలర్ లో వారికి ఎవరికి కూడా స్థానం దక్కలేదు. కేవలం బాలయ్య, విద్యాబాలన్ లు మాత్రమే కనిపించారు. వారిద్దరితోనే కట్ అయిన ఈ ట్రైలర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.
‘ఎన్టీఆర్’ కథానాయకుడు ట్రైలర్ అంటూ విడుదలైన ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, అసెంబ్లీకి సంబంధించిన షాట్స్ కూడా ఉన్నాయి. కనుక మహానాయకుడు ట్రైలర్ ఉంటుందో లేదో చూడాలి. మొత్తానికి దర్శకుడు క్రిష్ ఏమాత్రం నిరాశ పర్చకుండా ట్రైలర్ తో సినిమా స్థాయిని అమాంతం పెంచాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల కాబోతుంది.
Full View