ఎన్టీఆర్‌ బర్త్‌ డే... ఆ మూడవ సర్‌ ప్రైజ్‌ ఏంటీ?

Update: 2022-05-11 06:33 GMT
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్‌ 30 కి సంబంధించిన అప్డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్‌ ఆర్‌ ముగిసి నెలలు గడుస్తున్నా కూడా ఎన్టీఆర్‌ 30 సినిమా ఎప్పుడు మొదలు అయ్యేది క్లారిటీ ఇవ్వడం లేదు.

ఆచార్య సినిమా ఫలితం బెడిసి కొట్టడంతో ఎన్టీఆర్‌ 30 సినిమా మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ 31 సినిమా కూడా ఇప్పటికే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ 31 సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా ఇప్పుడే సినిమా నుండి ఎన్టీఆర్‌ లుక్ ను రివీల్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా ట్రిపుల్ ధమాకా అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఆ మూడవ సర్‌ ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఆ మూడవ సర్‌ ప్రైజ్ ఏంటీ అంటే ఆర్ ఆర్‌ ఆర్‌.

ఔను... ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను మే 20వ తారీకున ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా స్ట్రీమింగ్‌ కు సిద్దం చేశారు. థియేటర్లలో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్‌ ఆర్‌ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటీటీ లో సినిమా ను చూడాలని భావిస్తారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ గా ఎన్టీఆర్‌ నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్‌ మొదటి పుట్టిన రోజు కనుక ఖచ్చితంగా దేశం చూసే విధంగా సోషల్‌ మీడియాలో మరియు బయట భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags:    

Similar News