నా దృష్టిలో ఎన్టీఆర్ కంప్లీట్ యాక్టర్!

Update: 2022-03-24 02:30 GMT
రాజమౌళి ఒక కాన్సెప్ట్ అనుకున్నారంటే, దాని నుంచి నూరు శాతం అవుట్ పుట్ రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఆయన చేసే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలను మలిచే విధానం డిఫరెంట్  గా ఉంటుంది. రాజమౌళి ఆలోచనలను తెరపై ఆవిష్కరించే సినిమాటోగ్రఫర్ గా సెంథిల్ కుమార్ కనిపిస్తారు. రాజమౌళితో కలిసి ఆయన చాలా కాలంగా ప్రయాణిస్తున్నారు. ఆయన కెమెరా పనితనానికి నిలువెత్తు నిదర్శనంగా 'బాహుబలి' కనిపిస్తుంది. ఆయన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి కూడా పనిచేశారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో సెంథిల్ కుమార్ మాట్లాడారు. "రాజమౌళి గారి ఆ ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. ఆయనతో కలిసి  ఎక్కువ  దూరం ప్రయాణం  చేయడం వలన, ఆయనకి ఏం కావాలనేది నాకు అర్థమైపోతుంది. అప్పడు  నేను నా నుంచి ఆయన ఆశించేదానికంటే బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది నాకు ఒక ఛాలెంజ్ అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా  .. ఒలీవియా .. ఇలా చాలామంది ఆరిస్టులు ఉన్నారు. ఇంతమందిలో నా కెమెరా కళ్లకి నచ్చేదెవరని అడిగితే ఎన్టీఆర్ అనే చెబుతాను.

కెమెరా ముందుకు ఎన్టీఆర్ రాగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి.  పుట్టుక తోనే ఆయన ఆర్టిస్ట్ అనీ .. కంప్లీట్ యాక్టర్ అనిపిస్తూ ఉంటుంది. ఒక నటుడికి ఎలాంటి లక్షణాలు అయితే  ఉండాలో అలాంటి లక్షణాలు పూర్తిగా కలిగినవాడిగా నాకు ఎన్టీఆర్ కనిపిస్తాడు.

ఫారెస్టులో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తే సీన్లో ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ డైరెక్టర్ అనుకున్న విధంగా రావడానికి ఆ స్థాయిలో కష్టపడే ఆర్టిస్టుగా ఎన్టీఆర్ కనిపిస్తాడు.

చరణ్ కూడా గొప్ప స్టార్ .. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎన్టీఆర్  స్థాయిలోనే ఆయన కూడా డాన్స్ చేయవచ్చు .. పెర్ఫార్మ్ చేయవచ్చు. కానీ ఎన్టీఆర్ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చరణ్ మాత్రం ఇంకా బాగా చేయవచ్చా? అన్నట్టుగానే స్టూడెంట్ యాటిట్యూడ్ తో ఉంటాడు.

ఇక అజయ్ దేవగణ్ .. అలియా భట్ పాత్రలు కూడా  ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. యాక్షన్  తో కూడిన ఎమోషన్ వాళ్లను కట్టుపడేస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ టాక్ వినడం కోసమే వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News