టాలీవుడ్ సెంటిమెంటు పరిశ్రమ అన్న సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల ప్రవాహం వెనక బోలెడంత సెంటిమెంటు సెంటు దాగి ఉంటుంది. ముఖ్యంగా టైటిళ్ల విషయంలోనూ ఇది కనిపిస్తూ ఉంటుంది. ఆ కోణంలో ఇప్పుడు నాన్నకు ప్రేమతో టైటిల్ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో రంధ్రాన్వేషణ మొదలైంది. నాన్నకు ప్రేమతో ఎన్ అనే అక్షరంతో మొదలైంది. కాబట్టి ఆ అక్షరంతో మొదలై హిట్ కొట్టిన సినిమాలేవీ? అంటూ ఆరా తీస్తున్నారంతా.
అలా వెతికితే ఎన్టీఆర్ కెరీర్ లో నాలుగు సినిమాలున్నాయి. నిన్ను చూడాలని - నా అల్లుడు - నాగ - నరసింహుడు .. ఇవన్నీ ఫ్లాప్ సినిమాలే. ఇప్పుడు నాన్నకు ప్రేమతో కూడా ఎన్ అనే అక్షరంతోనే మొదలైంది కాబట్టి అభిమానుల్లో ఆందోళన మొదలైందని చెబుతున్నారు. అయితే సుకుమార్ కానీ, ఎన్టీఆర్ కానీ మరీ ఇంత నెగెటివ్ సెన్స్ తో ఏనాడూ ఆలోచించలేదు. సరుకుంటే సెంటిమెంటుతో పనేంటి?
మనలో విషయం ఉంది. మన కథలో దమ్ముంది. నీలో పౌరుషం ఉంది. గెలుపు గుర్రంలా దూకుడుంది.. అంటూ సెంటిమెంటుకు తలొగ్గకుండా ముందుకెళుతున్నారు. ఎట్టి పరిస్థితిలో నాన్నకు ప్రేమతో హిట్టు కొట్టి తీరుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ కి బోలెడంత అప్లాజ్ వచ్చింది. టీజర్లకు విపరీతమైన క్రేజు వచ్చింది. కాబట్టి కంటెంట్ పరంగా కొట్టుకొచ్చేస్తామన్న నమ్మకం సుక్కూ, ఎన్టీఆర్ లో ఉంది. ఆ కాన్ఫిడెన్సే విజయాన్ని ఇస్తుంది.