యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. చరణ్ 'మన్నెందొర అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా తారక్ గిరిజన ఉద్యమకారుడు 'కొమురం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడికల్ మల్టీస్టారర్ ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'ఆర్.ఆర్.ఆర్' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్ మరియు చరణ్ ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో తారక్ ఇంట్రో వీడియో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా కనిపిస్తుండగా.. బ్యాగ్రౌండ్ లో కొమురం భీమ్ షాడో ఇమేజ్ కనిపిస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు నైజాం ప్రాంతంలో రజాకార్లపై తిరుగుబాటు చేయడానికి.. కొమరం భీమ్ ముస్లింగా మారువేషంలో కనిపిస్తాడేమో అనే ఆలోచన కలుగుతోంది. అలానే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేశారు. ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ తెచ్చుకుంటోంది. ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని.. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కొన్ని రోజులు కనిపించకుండా పోయిన పీరియడ్ లో ఇద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా నుంచి పుట్టిందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్ - ఒలీవియా మోరిస్ - అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ ఈ మూవీలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.