షాక్‌: తార‌క రాముని కంట క‌న్నీళ్లు!

Update: 2018-10-02 16:13 GMT
నందమూరి బ్ర‌ద‌ర్స్‌ ఎన్టీఆర్‌ - క‌ళ్యాణ్‌ రామ్ మ‌ధ్య అనుబంధం గురించి తెలిసిందే. ఆ అనుబంధానికి - ఆ ఇద్ద‌రిలోని ఎమోష‌న్‌ కి వేదిక‌గా నిలిచింది అర‌వింద స‌మేత ప్రీరిలీజ్ వేడుక‌. వేదికపై క‌ళ్యాణ్‌ రామ్ ఎమోష‌న్ అయితే వేదిక దిగువ‌న అన్న‌నే చూస్తున్న తార‌క‌రాముని కళ్లు ఎర్ర‌బారాయి. క‌న్నీళ్లు కారాయి. ఆ దృశ్యం ఆద్యంతం నంద‌మూరి అభిమానుల్నే కాదు, అంద‌రినీ క‌ల‌చివేశాయి. ఆ ఆవేద‌న - ఉద్వేగం వెన‌క అస‌లు కార‌ణ‌మేంటో అంద‌రికీ తెలుసు. ఆ కుటుంబంలో ఊహించ‌ని - ఆక‌శ్మిక మ‌ర‌ణాలే అందుకు కార‌ణం. క‌ళ్యాణ్‌ రామ్ స్పీచ్ ఆద్యంతం త‌న‌నే చూస్తున్న తార‌క్‌ కి ఉద్వేగం ఎక్క‌డా ఆగ‌లేదు.

వేదిక‌పై క‌ళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ -``త్రివిక్ర‌మ్‌- త‌మ్ముడు కాంబినేష‌న్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. నాలానే మీరూ ఎదురు  చూస్తున్నార‌ని తెలుసు. అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు - అద్భుత‌మైన న‌టుడు క‌లిస్తే ఎలా ఉంటుందో చిన్న మ‌చ్చుక‌గా ట్రైల‌ర్ చూపించారు. ట్రైల‌ర్ అదిరిపోయింది. ఈ వేళ ఒక విష‌యం చెప్పాలి. నాన్న గారు ఒక విష‌యం చెప్పారు అది గుర్తు చేసుకుంటా. 1962 సంవ‌త్స‌రంలో పొద్దున్నే మేక‌ప్ వేసుకుని షూటింగుకి వెళ్లారు తాత‌ నంద‌మూరి తార‌క రామ‌రావు గారు. షూటింగులో ఉండ‌గా ఫోన్‌ లో ఒక అశుభ వార్త వినాల్సొచ్చింది. ఆయ‌న పెద్ద కొడుకు - మా పెద‌నాన్న నంద‌మూరి రామ‌కృష్ణ కాలం చేశార‌ని.. అది జ‌రిగిన‌ప్పుడు ఏ తండ్రీ త‌ట్టుకోలేరు. కానీ ఆయ‌న మేక‌ప్ వేసుకుని లొకేష‌న్‌ లో ఉన్నారు. నిర్మాత‌కు న‌ష్టం కాకూడ‌ద‌ని..రోజంతా షూటింగ్ పూర్తి చేసి అప్పుడు వెళ్లారు. చేతికందిన కొడుకు చ‌నిపోతే ఉంటారా..అండీ! అంత గొప్ప‌వారు తాత‌గారు. వృత్తి ధ‌ర్మం. తాత‌గారు షూటింగులో ఉన్న‌ప్పుడు ముత్తాత ల‌క్ష్మ‌య్య గారు యాక్సిడెంట్‌ లో మ‌ర‌ణించారు. ఆరోజు కూడా వృత్తికిచ్చిన గౌర‌వం - నిర్మాత‌కిచ్చిన క‌మిట్‌ మెంట్ వ‌ల్ల‌ షూటింగ్ చేసి ఇంటికెళ్లారు.

1982లో మా బాల‌య్య బాబాయ్ పెళ్లి - మా రామ‌కృష్ణ బాబాయ్ పెళ్లి. వారి పెళ్లి జ‌రుగుతుంటే .. నెల‌రోజుల్లో ఎల‌క్షన్స్ ఉంటే ఆ ప్ర‌చారంలో ఉండి తాత‌గారు పెళ్లికే వెళ్ల‌లేదు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని న‌మ్మారు కాబ‌ట్టి! ఎవ‌రైనా సొంత కొడుకుల పెళ్లి కి వెళ్ల‌కుండా జ‌రిపిస్తారా? ప‌నికి ఇచ్చిన గౌర‌వం. అలానే వాళ్ల‌మ్మ‌కిచ్చిన మాట‌తో నాన్న‌గారిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటాను.. కంటికి రెప్ప‌గా కాపాడ‌తాన‌ని మాటిచ్చిన మా నాన్న‌గారు.. వాళ్ల తండ్రి గారి ఆఫీస్ బోయ్‌ గా  - చైత‌న్య ర‌థ సార‌థిగా ఆయ‌న వెన్నంటి ఉండి కొడుకుగా క‌ర్త‌వ్యాన్ని నెర‌వేర్చారు. అలాగే ఆగ‌స్టు 29  - 2018 మా ఇంట్లో కూడా ఒక సంఘ‌ట‌న జ‌రిగింది. అది జ‌రిగిన‌ప్పుడు 30 రోజుల షూటింగ్ ఉంది అర‌వింద స‌మేత‌. అవ్వుద్దా రిలీజ్ అనుకున్నారు. కానీ నిర్మాత బావుండాలి. ఇచ్చిన మాట నిల‌బ‌డాలి అని ఐదో రోజు త‌మ్ముడు షూటింగుకి వెళ్లాడు. నాన్‌ స్టాప్‌ గా  డే & నైట్ ప‌నిచేసి ఈరోజు ఈ ఆడియోకి రాగ‌లిగాం. మీరంద‌రూ చూస్తున్నారు... అంటూ ఉద్వేగాన్ని రంగ‌రించాడు. బ్ర‌ద‌ర్స్ ఎమోష‌న్ అంద‌రి ఎమోష‌న్ అయ్యింది ఆ క్ష‌ణం.


Tags:    

Similar News