ఇంకో 40 గంటల కంటే తక్కువ సమయంలోనే అరవింద సమేత వీర రాఘవ తొలి షోలు పడబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో ఉండగా బెనిఫిట్ షో టికెట్ల కోసం డిమాండ్ చూసి థియేటర్ యజమానులు షాక్ తింటున్నారు. గత నాలుగైదు రోజులు దీని ప్రమోషన్ కోసం ఊపిరి సలపనంత బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా అనిరుద్ ని కాకుండా తమన్ ను తీసుకోవడం వెనుక మీ ప్రమేయం ఉందా అని అడిగిన ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో చమత్కారంగా కౌంటర్ ఇవ్వడం చురకలా పనిచేసింది.
అరవింద సమేత వీర రాఘవ కథ తనే రాసుకున్నానని జగపతి బాబు పాత్రను కూడా తనే పోషించి గ్రాఫిక్స్ లో ఆయన ఫేస్ ని అతికించామని చెప్పి కొన్ని సెకండ్లు షాక్ ఇచ్చాడు. నిజానికి తారక్ ఉద్దేశం వేరని ఆ తర్వాత అర్థమైంది అందరికి. త్రివిక్రమ్ లాంటి వాళ్లకు తాను చెప్పేది ఏముంటుందని ఆయన అనుభవం ముందు తాను ఏమి కానని ఒప్పేసుకున్నాడు ఎన్టీఆర్. ఎవరిని తీసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన సెలక్షన్ కు అభ్యంత పెట్టేందుకు ఏముంటుందని క్లారిటీ ఇచ్చేసాడు. నిజాయితీగా తాను దేనికి నో చెప్పలేదని ఆయన చెప్పినట్టు నటించడం మాత్రమే చేసానని కుండబద్దలు కొట్టేసాడు.
అజ్ఞాతవాసి పరాజయంలో అనిరుద్ సంగీతం పాత్ర కూడా ఉందని భావించే తారక్ తమన్ కావాలని అడిగాడని షూటింగ్ ప్రారంభానికి ముందు వార్తలు వచ్చాయి. అది దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఎదురైన ప్రశ్నకు తారక్ తెలివిగా సమాధానం ఇచ్చాడు. అయినా త్రివిక్రమ్ రచన చేసి ఓ నిర్మాతగా వ్యవహరించిన చల్ మోహనరంగాకు కూడా తమనే మ్యూజిక్ ఇచ్చాడు. మరి అది తారక్ చెబితేనే ఇచ్చి ఉంటాడా అనే అభిమానుల లాజిక్ లో మీనింగ్ ఉంది మరి.