వాళ్లిద్దరూ ఈ ఎన్టీఆర్ ను చంపేస్తారట

Update: 2017-07-12 04:18 GMT
తెలుగులో యాంటీ క్లైమాక్స్ లను చూడడం అంటే చాలా క్లిష్టమైన విషయం. ఎంతో గొప్ప దర్శకులుగా పేరు సంపాదించిన వారు కూడా.. తెలుగు ఆడియన్స్ కోసం స్పెషల్ గా క్లైమాక్స్ లను చిత్రీకరించిన సంగతి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ విషయంలో ఏం జరగనుందనే ఆసక్తి అందిరిలోనూ కనిపిస్తోంది.

జై లవ కుశ చిత్రంలో జై.. లవ.. కుశ అంటూ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనుండగా.. రీసెంట్ గా జై పాత్రను పరిచయం చేశారు కూడా. జై రోల్ లో భయంకరమైన విలన్ గా నటిస్తున్నాడు యంగ్ టైగర్. కానీ స్టోరీ ప్రకారం.. టాలీవుడ్ కమర్షియల్ మూవీ ఫార్ములా ప్రకారం ఈ పాత్రను క్లైమాక్స్ లో చంపేయాల్సి వస్తుందట. అది కూడా లవ.. కుశ.. రెండు పాత్రలు కలిసి మూవీ చివరలో జై పాత్రను చంపేస్తారట. చంపే పాత్రలను కూడా ఎన్టీఆరే పోషిస్తున్నా.. చనిపోయే పాత్ర గురించే ఆలోచించాలి. ఆన్ స్క్రీన్ పై జై పాత్రను చంపేసినా.. ఫ్యాన్స్ మాత్రం అక్కడ ఎన్టీఆర్ నే చూసుకుంటారు. తమ హీరో స్క్రీన్ పై చనిపోవడం అనే పాయింట్ ను వారు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే అసలైన పాయింట్.

విలన్ రోల్ ను ఎన్టీఆర్ పోషించినా సరే.. రోల్ ను నిర్దాక్షిణ్యంగా చంపేయడం అనేది.. తెలుగు సినిమా పడికట్టు రూల్. మరి జై లవ కుశ విషయంలో కూడా దీన్నే ఫాలో అవుతారా.. లేక తెలుగు జనాలు.. నందమూరి ఫ్యాన్స్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని క్లైమాక్స్ ను కొత్తగా మారుస్తారా అనే విషయం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
Tags:    

Similar News