ఏదన్నా కొత్తగా ఒక ట్రైలర్ వచ్చినా.. లేదంటే కొన్ని పోస్టర్లు వచ్చినా.. వెంటనే అవి ఎక్కడి నుండి కాపీ చేశారో చూద్దాం అంటూ చాలామంది బూతద్దం వేసుకుని బయలుదేరుతుంటారు. దానికి తగ్గట్లే మన తెలుగు సినిమాల్లో కూడా అన్నీ కాపీ సీన్లు కాపీ కథలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కాపీ బెడద ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవ కుశ కు కూడా తప్పేట్లేదు.
ఆల్రెడీ ఈ సినిమా కథను 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే హాలీవుడ్ సినిమా నుండి లేపారని అంటుంటే.. ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన ఒక సీన్ .. అచ్చం మెగాస్టార్ చిరంజీవి 'రౌడీ అల్లుడు' సినిమాలోని సీన్ తరహాలో ఉండటం.. నెట్టింట్లో నానా రచ్చకు దారితిస్తోంది. మెగాస్టార్ మెగా హిట్ లో.. ఆటోజాని పాత్ర మంచివాడైన కళ్యాణ్ ప్లేసులో ఆఫీసుకు వస్తాడు. ఆ రెండు పాత్రలూ చిరంజీవే చేశాడులే. అలా ఆఫీసుకు వచ్చి.. అక్కడ అమ్మాయిల అందాలను చూడటం.. అలాగే అందరిమీదనా కామెడీ చేయడం.. అబ్బో ఓ రేంజులో ఉంటుంది. ఇక్కడ కూడా లవ పాత్ర ప్లేసులో కుశ ఆఫీసుకు రావడం.. హంసానందినిని చూసి అవాక్కవ్వడం.. మిగతా స్టాఫ్ తో రచ్చ చేయడం.. అబ్బో ఓ రేంజులో సేమ్ అదే తరహాలో ఉంది.
ఇప్పుడు నెట్లో చూస్తే.. అసలు రౌడీ అల్లుడు సినిమాలో ఆ సీన్ తాలూకు స్ర్కీన్ షాట్లు.. అలాగే జై లవ కుశ లోని ఈ సీన్ తాలూకు స్ర్కీన్ షాట్లనూ పక్కప్కనే పెట్టేసి.. జనాలు నానా హంగామా చేస్తున్నారు. దీనిపై రచయిత దర్శకుడు కె.ఎస్.రవీంద్ర ఏమంటాడో చూడాలి.