లోగో లుక్‌: జై లవ కుశ కిక్కివ్వలేదే

Update: 2017-04-05 04:30 GMT
ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ''జై లవ కుశ'' అనే సినిమాతో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా లోగోను లాంచ్ చేశాడు. లోగోను తెలుగు మరియు ఇంగ్లీష్‌ బాషల్లో రిలీజ్ చేయడమే కాకుండా.. వాటి తాలూకు మోషన్ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయ్. ఇంతకీ ఈ లోగో లుక్ ఎలా ఉంది?

నిజానికి 'జై లవ కుశ' అనే టైటిల్ కు గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక డివోషనల్ ఫిలిం చేయడం కారణంగా చాలా పాపులార్టీ ఉంది. అందుకే ఆ టైటిల్ ఖచ్చితంగా ఆసక్తిని రేపింది. అయితే కమర్షియల్ సినిమాకు ఇటువంటి టైటిల్ ఎలా ఉంటుంది అనుకుంటే.. మనోళ్ళు డిజైన్ పరంగా చాలా సింపుల్ గా తేల్చేశారు. మునపటి హిట్ జనతా గ్యారేజ్ వంటి సినిమాల లోగోలు చూసుకుంటే.. వాటిలో చాలా డెప్త్ అండ్ కంటెంట్ కనిపించింది కాని.. ఇక్కడ మాత్రం కేవలం సింపుల్ టెక్ట్స్ ఉండడం పెద్దగా కిక్కివ్వట్లేదు.

ఇకపోతే మోషన్ పోస్టర్ విషయానికస్తే.. రాముడు రూపాలను చూపించి.. రావణుడి తలల బ్లాస్ట్ అయినట్లుగా గ్రాఫిక్స్ ఏదో ప్రయత్నించారు కాని.. ఎందుకో అవి చాలా తేలిపోయాయ్. కాస్త హడావుడిలో మోషన్ పోస్టర్ చేయించారని అర్ధమవుతోంది. చూద్దాం.. జూ.ఎన్టీఆర్ లుక్ కూడా జతకలిశాక ఈ సినిమా పోస్టర్లు ఇంకా కిక్కిస్తాయేమో.


Full View
Tags:    

Similar News