యంగ్ టైగర్ అప్పుడే అవగొట్టేశాడా?

Update: 2016-01-31 11:30 GMT
50 కోట్ల క్లబ్.. చాలా ఏళ్లుగా ఊరిస్తూ వస్తోంది ఎన్టీఆర్ ను. తన తర్వాత వచ్చిన హీరోలు.. చాలా ఆలస్యంగా స్టార్ ఇమేజ్ సంపాదించున్న హీరోలు కూడా ఈజీగా 50 కోట్ల క్లబ్బును అందుకంటుంటే.. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన తనకు ఈ ఘనత అందకపోవడం ఎన్టీఆర్ ను మెలిపెట్టేది. కానీ ‘నాన్నకు ప్రేమతో’ ఆ లోటు తీర్చేసింది. రెండు వారాల ప్రదర్శన తర్వాత 50 కోట్ల షేర్ రికార్డును అందుకున్నాడు ఎన్టీఆర్. శాటిలైట్ ఇతర హక్కులవీ కలిపితే మొత్తంగా రూ.60 కోట్ల దాకా తెచ్చిపెట్టింది ‘నాన్నకు ప్రేమతో’. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే పెద్ద హిట్టు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఐతే స్టార్ హీరోలకు పెద్ద హిట్టు వచ్చిందంటే.. ఆ తర్వాత వచ్చే సినిమాకు అదే బెంచ్ మార్క్ అవుతుంది. బిజినెస్ కూడా దాని ప్రకారమే జరుగుతుంది. గత సినిమా ఎంత వసూలు చేసిందో చూసుకుని దాని మీద కొంచెం అదనంగా డిమాండ్ చేస్తాడు నిర్మాత. బయ్యర్లు కూడా ఈ విషయంలో వెనకడుగేమీ వేయరు. ఎన్టీఆర్ తర్వాతి సినిమా ‘జనతా గ్యారేజ్’ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవకుండానే ఈ సినిమాకు బిజినెస్ అయిపోయినట్లు చెబుతున్నారు. నిర్మాతలు పైసా పెట్టకుండా మొత్తం అడ్వాన్సులతోనే సినిమా తీసేసే పరిస్థితి వస్తోంది. అన్ని ఏరియాల బయ్యర్లూ అప్పుడే అగ్రిమెంట్లు చేసేసుకున్నారట. మొత్తం బిజినెస్ రూ.60 కోట్లకు పైమాటే అంటున్నారు. ఎన్టీఆర్ వరుసగా రెండు హిట్లు కొట్టి ఊపు మీదుండగా.. డైరెక్టర్ కొరటాల శివ కూడా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. అందులోనూ ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని ఆకర్షణలున్నాక ఈ మాత్రం బిజినెస్ జరగడంలో ఆశ్చర్యమేముంది?
Tags:    

Similar News