ఎన్టీఆర్ పై తొడకొట్టబోతున్న విక్రమ్

Update: 2016-08-20 11:33 GMT
సెప్టెంబరు 2న రిలీజవబోతున్న ‘జనతా గ్యారేజ్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి పోటీగా ఇంకో సినిమా రిలీజ్ చేయడం సాహసమే. ఐతే విక్రమ్ కొత్త సినిమా ‘ఇంకొక్కడు’ను మాత్రం ఆ రోజే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా తమిళంలో సెప్టెంబరు 2నే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఐతే తెలుగులో ‘జనతా గ్యారేజ్’ వస్తోందని వాయిదా వేసే పరిస్థితి లేదు.

ఇంతకుముందు విక్రమ్ సినిమా ‘10 ఎన్రదుకుల్లా’ను ముందు తమిళంలో రిలీజ్ చేసి...  ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో డబ్బింగే ఆపేశారు. అసలే విక్రమ్ సినిమాల విషయంలో మునుపటి క్రేజ్ ఇప్పుడు లేకపోవడంతో ‘ఇరుముగన్’ తమిళ వెర్షన్ విషయంలో ఏదైనా తేడా కొడితే తెలుగు వెర్షన్ సంగతి అయోమయంలో పడుతుంది.

ఈ చిత్రం తెలుగు హక్కుల్ని నీలం కృష్ణారెడ్డి అనే నిర్మాత రూ.11 కోట్లకు కొనడం విశేషం. ఈ నిర్మాతకు బూస్ట్ ఇస్తూ లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్.. ‘ఇంకొక్కడు’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రెండు రాష్ట్రాలకూ హోల్ సేల్ గా కొనేయడం విశేషం. అభిషేక్ చేతిలో థియేటర్లుండటంతో సెప్టెంబరు 2నే ‘జనతా గ్యారేజ్’కు పోటీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    

Similar News