ఎవరు అవునన్నా కాదన్నా టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది మహానటినే. అదసలు రాకపోయి ఉంటే ఇవాళ ఎన్టీఆర్ కథానాయకుడు కూడా ఉండేది కాదన్న సత్యాన్ని ఒప్పుకుని తీరాలి. అసలు నాన్న కథను చూపించాలని బాలయ్యకు తట్టిందే మహానటి చూసాక. మహానటి విడుదలై ఏడాది కూడా గడవకుండానే ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చేసాడు. సో తప్పకుండ పోలికతో పాటు అంత ఎమోషన్ ఇందులో ఉందా అనే లెక్కలు మొదలవుతాయి.
సావిత్రి ఎన్టీఆర్ లకు ఇమేజ్ విషయంలో వ్యక్తిత్వంలో చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకే తరానికి చెందిన తారలు కాబట్టి ఇప్పుడు వృధాప్యంలో ఉన్న వాళ్ళు అప్పుడు యువతీ యువకులుగా వీళ్ళను ఆరాధించిన వాళ్ళు ఖచ్చితంగా రెండు సరిపోల్చుకుంటారు. అలా చూసుకుంటే మహానటి కథానాయకుడు రెండింట్లో ఏది బాగా మెప్పించింది అనే చర్చ రావొచ్చు.
నిజానికి మహానటి కూడా పూర్తిగా సావిత్రి గారి జీవితాన్ని చూపించిన కథ కాదు. కాకపోతే సాధ్యమైనంత మేర వాస్తవాలను పొందుపరిచి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు నాగ అశ్విన్ తన టేకింగ్ తో కట్టిపడేసాడు. అయితే క్రిష్ ఆ స్థాయిలో కథానాయకుడుని ప్రెజెంట్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిలో నిజానిజాలు ఏంటో బాక్స్ ఆఫీస్ లెక్కలు చెబుతాయి కాబట్టి దీని గురించి కంక్లూజన్ కు ఇప్పుడే రావడం తొందరపాటు అవుతుంది. మహానటి స్టార్ హీరో లేకుండా 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ కథానాయకుడు బాలయ్య లాంటి మాస్ స్టార్ హీరోతో అంతకు రెట్టింపు రాబట్టాల్సిన టార్గెట్ తో బరిలో దూకింది. సో ఇంకో వారం పది రోజులు అయ్యాక పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వేచి చూద్దాం.
Full View