ఫోటో స్టొరీ: 8 ఏళ్ళు.. అంటున్న యంగ్ టైగర్

Update: 2019-05-05 12:12 GMT
మన స్టార్ హీరోలో దాదాపుగా మెజారిటీ హీరోలు టైం దొరికితే చాలు ఫ్యామిలీతో గడిపేందుకు ఉత్సాహం చూపిస్తారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దీనికి ఎక్సెప్షన్ ఏమీ కాదు. ఎన్టీఆర్ కు ఏ మాత్రం సమయం దొరికినా వైఫ్ ప్రణతి.. ఇద్దరు పిల్లలతో గడిపేస్తుంటాడు.  అయితే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే హీరోలకు.. టెక్నిషియన్లకు అదో యజ్ఞం లాంటిది. ప్రస్తుతం 'RRR' లో నటిస్తుండడంతో ఎన్టీఆర్ కు పెద్దగా హాలిడేస్ దొరికే అవకాశం లేదు. కానీ దురదృష్టవశాత్తూ ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో  RRR షూటింగ్ కొద్దిరోజులు వాయిదా పడింది. సరిగ్గా ఈ సమయాన్నే ఫ్యామిలీతో చిల్ అవుట్ అయ్యేందుకు ఉపయోగిస్తున్నాడు ఎన్టీఆర్.

అయితే ఈ రోజు ఎన్టీఆర్-ప్రణతిల మ్యారేజ్ యానివర్సరీ.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "ఎనిమిది ఏళ్ళయింది.  ఇంకా ఇలాంటివి ఎన్నో జరుపు కోవాలని వేచిచూస్తున్నాం." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.   ఈ ఫోటోకు నెటిజనుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.  హ్యాపీవెడ్డింగ్ యానివర్సరీ అన్నా వదినా.. హ్యాపీ మ్యారేజ్ డే.. అంటూ మెసేజులు పోటెత్తాయి.  కొందరు లవ్లీ కపుల్ అంటూ ఇద్దరికీ కాంప్లిమెంట్ ఇచ్చారు.

ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఎడమచేతికి కట్టు ఉంది. అయినా అదేమీ పెద్ద ఇబ్బంది కానట్టు చిరు నవ్వు నవ్వుతూ పోజిచ్చాడు. ప్రణతి కూడా ఎన్టీఆర్ కు దగ్గరగా కూర్చొని ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చింది.  మరి ఈ ఫోటోను తీసింది బుల్లి యంగ్ టైగర్ అభయ్ రామా లేదా వేరే ఎవరైనా అనే సంగతి మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా ఎన్టీఆర్ కు గాయం అయిన తర్వాత బయట కనిపించలేదు.  ఈ ఫోటో ఫ్యాన్స్ కు ఒక స్వీట్ సర్ ప్రైజే.  త్వరగా ఎన్టీఆర్ కోలుకోవాలని.. RRR షూటింగ్ లో జాయిన్ అవ్వాలని కోరుకుందాం. 
Tags:    

Similar News