నాన్నకు ప్రేమతో సక్సెస్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన జోనర్ కి విభిన్నంగా చేయడమే కాదు, కొత్త స్టైల్ తో ఎన్టీఆర్ కనిపించిన లుక్ కి ప్రేక్షకులు, అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు, తొలిసారిగా ఈ నందమూరి హీరోని 50 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్తోంది నాన్నకు ప్రేమతో.
ఇంతగా ఈ సినిమా హిట్ కావడంలో ఎన్టీఆర్ అల్ట్రా స్టయిలిష్ అవతార్ కూడా భాగమయ్యిందని చెప్పాల్సిందే. గెడ్డం, హెయిర్ స్టైల్ విషయంలో కొత్త లుక్ చూపించాడు. ఇప్పుడిది ఎన్టీఆర్ సృష్టించిన ట్రెండ్ అనే రేంజ్ కి ఆదరణ పొందుతోంది. అయితే, ఈ గెడ్డాన్ని ఎన్టీఆర్ సెంటిమెంట్ గా చేసుసుకున్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ మళ్లీ గెడ్డం పెంచుతున్నాడు. మరోసారి నాన్నకు ప్రేమతో లుక్ టైపులోనే తయారయిపోతున్నాడు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చినపుడు ఈ విషయం వెల్లడైంది.
నిజానికి ఎన్టీఆర్ తన గెడ్డాన్ని సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే తీసేశాడు. తన కొడుకు అసలు తనను గడ్డం లేకుండా చూడలేదని, అందుకే తన ఫేస్ చూపించడానికే గెడ్డం తొలగించానని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ గెడ్డం పెంచుతున్నాడంటే.. అది ఖచ్చితంగా కొరటాల శివతో చేయబోతున్న నెక్ట్స్ సినిమా జనతా గ్యారేజ్ కోసమే అనుకుంటున్నారు. ఎలాగూ రఫ్ కేరక్టర్ కాబట్టి గెడ్డం ఉన్నా బాగానే ఉంటుంది. మరో వైపు సెంటిమెంట్ గా కూడా అచ్చొచ్చింది కదా.