ఎన్టీఆర్ కథానాయకుడు అనూహ్యంగా చేదు ఫలితాన్ని ఇవ్వడం అటు అభిమానులతో పాటు ఇటు క్రిష్ టీమ్ కు సైతం మింగుడు పడటం లేదు. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమన్న నమ్మకంతో బరిలో దిగితే టాప్ 3 ఇండస్ట్రీ డిజాస్టర్స్ లో చోటు దక్కించుకోవడం ఎవరూ ఊహించనిది. ఇప్పుడు ఎంత లేదన్నా దీని ప్రభావం మహానాయకుడి మీద ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా మొదటి భాగం సూపర్ హిట్ అయిన సినిమాల సీక్వెల్స్ కే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఇక్కడ కేసు రివర్స్.
కథానాయకుడు తేడా కొట్టింది. టాక్ బాగున్నా పెట్టుబడి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో మహానాయకుడు మీద అంచనాలు తగ్గడం సహజం. ఇది దృష్టిలో ఉంచుకునే క్రిష్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారిక సమాచారం లేదు కానీ కొన్ని కీలకమైన సన్నివేశాలను రీ షూట్ చేసి ఇంకాస్త ఎఫెక్ట్ తో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు సమాచారం. అయితే ట్రైలర్ లో రెండు భాగాలూ ఉన్న సీన్లు జోడించే కట్ చేసారు. అంటే షూటింగ్ కూడా సమాంతరంగా అయిపోయి ఉండాలి. ఇప్పుడు బాలన్స్ చిత్రీకరణ అంటే రీ షూట్ మాట నిజమేనేమో అనిపిస్తుంది.
ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఎమోషన్ తో కావాల్సినంత డ్రామా ఉందని కథానాయకుడిలో జరిగిన లోపాలు ఇందులో రిపీట్ కావనే నమ్మకంతో క్రిష్ ఉన్నాడని తెలిసింది. అయితే ఏ ఘట్టాలు ఉంటాయి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎవరినైనా విలన్లుగా చూపించబోతున్నారా లాంటి ప్రశ్నలకు సమాధానం విడుదల తర్వాతే దొరుకుతుంది. ముందే ప్రకటించిన ఫిబ్రవరి 7న విడుదల అవుతుందా లేక ప్రచారంలో ఉన్నట్టు 14కు వాయిదా వేసారా అనే దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Full View