ఎన్నో అంచనాలతో విడుదలై చివరికి డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు ప్రభావం మహానాయకుడు మీద మాములుగా పడలేదు. ఏకంగా విడుదల తేదీనే అయోమయంలో పడేంత డిఫెన్స్ లోకి తోసేసింది. సంక్రాంతి ఫలితం తెలియడం ఆలస్యం క్రిష్ టీమ్ అప్పటి నుంచే మహానాయకుడు మార్పుల గురించి విపరీతమైన చర్చల్లో మునిగి తేలింది. ఫలితంగా స్క్రిప్ట్ లో చేసిన కీలక మార్పులు చివరికి షూటింగ్ ని సైతం ఆలస్యం చేయించాయి.
ఇకపోతే ఎన్టీఆర్ బసవతారకం మధ్య కెమిస్ట్రీని అంత ఎమోషనల్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారనే కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న క్రిష్ ఇప్పుడు ఏకంగా కొత్త ఆర్టిస్టులతో ఫ్లాష్ బ్యాక్ ని రీ షూట్ చేస్తున్నట్టుగా టాక్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న గ్రీష్మను ఇందులో బసవతారకంగా లీడ్ రోల్ లో పరిచయం చేస్తున్నారు. అయితే యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్య కంటిన్యూ అంటున్నారు కానీ గ్రీష్మ తన పక్కన తరుణ్ అనే బెంగళూరు కుర్రాడు చేస్తున్నాడు అని ఓ ఇంగ్లీష్ డైలీ ఇంటర్వ్యూలో చెప్పింది కాబట్టి సెకండ్ వెర్షనే నిజమయ్యే అవకాశం ఉంది.
ఇక కథలో మార్పుల్లో భాగంగా ఎన్టీఆర్ బసవతారకం మధ్య ఎలా పరిచయం మొదలైంది ఇద్దరి మధ్య అంత ఘాడమైన అనుబంధం ఎలా కుదిరింది లాంటి ఎపిసోడ్స్ ని హార్ట్ టచింగ్ గా డిజైన్ చేసాడట క్రిష్. అంతే కాదు ఫస్ట్ పార్ట్ లో చాలా పరిమితంగా అనిపించిన హరికృష్ణ సీన్స్ ని ఇందులో పొడిగించినట్టు తెలిసింది. కళ్యాణ్ రామ్ ఇందులో ఎక్కువసేపు కనిపిస్తాడు. సో ఈ పరిణామాలు గమనిస్తే మహానాయకుడు విడుదల గురించి ఇప్పటికిప్పుడు నిర్ణయానికి రావడం కష్టమే అనిపిస్తోంది. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నారు కానీ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు