ప్రస్తుతం టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం చాలా సాధారణమైన విషయం అయిపొయింది. మన స్టార్ హీరోలు ప్రతిసారీ వారి హిట్ సినిమాలతో ఏదో ఒక సెన్సేషన్ ని క్రియాట్ చేస్తున్నారు. సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి వారంలోనే ఊహకందని రికార్డులను తిరగరాస్తున్నారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలు ఎక్కువగా నైజాం ఏరియాల్లో వసూళ్లను రాబడుతున్నారు. నైజాం ఏరియాల్లో ఇప్పుడు 20 కోట్ల వరకు బిజినెస్ నడుస్తోంది.
ఇప్పటికే ఆ మార్క్ ను పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు వంటి స్టార్స్ తో పాటు ఆ తర్వాత ఉన్న ప్రభాస్ - రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కూడా అందుకున్నారు. కానీ ఒక్క స్టార్ మాత్రం 19 కోట్ల దగ్గర ఆగిపోయాడు. అతనే జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది తారక్ - జనతా గ్యారేజ్ సినిమాతో నైజాం ఏరియాల్లో 19 కోట్ల మార్క్ దగ్గర ఆగిపోయాడు. అయితే ఈ సారి ఎలాగైనా ఆ మార్క్ ను దాటాలని జై లవకుశతో రాబోతున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కొని 350 పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్థాయిలో రిలీజ్ అవుతుందంటే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా అక్కడ తారక్ 20 కోట్ల మార్క్ ను దాటెయ్యగలడని అంచనావేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి దసరా సెలవులు కలిసిరావడం కొంత ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. దానికితోడు అయిదు షోలు ఉండడం మరో బోనస్ పాయింట్. దీంతో తారక్ ఈజీగా ఆ టార్గెట్ ను క్రాస్ చేసి ఆ స్టార్ హీరోల జాబితాలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.