బ‌న్నీ అడిగాడ‌ని ఎన్టీఆర్ స్పెష‌ల్‌ గా..?!

Update: 2016-01-08 14:49 GMT
అభిమానులు ఏవేవో ఊహించుకుంటారు కానీ... తార‌ల మ‌ధ్య మాత్రం మంచి స‌ఖ్య‌త క‌నిపిస్తుంటుంది. ఒక‌రి సినిమాల్ని మ‌రొక‌రు అభినందించుకుంటూ ఉంటారు. త‌ర‌చుగా క‌లుసుకుంటూ మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. టాలీవుడ్ క‌థానాయ‌కుల్లో  ఎన్టీఆర్‌ - బ‌న్నీల మ‌ధ్య బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌రినొక‌రు బావ బావ‌... అని పిలుచుకుంటుంటారు. ఆ చ‌నువుతోనే ఎన్టీఆర్‌ ని `నీ సినిమా నాకే ముందు చూపించాలి` అని అడిగాడ‌ట బ‌న్నీ.  పైగా బ‌న్నీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఎన్టీఆర్  `నాన్న‌కు ప్రేమ‌తో` చేశాడు. ఆ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సుకుమార్ సినిమాని ఎలా తీశాడో అని బ‌న్నీ ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నాడ‌ట‌. సుక్కు క‌లిసిన‌ప్పుడు కూడా సినిమాని  ముందుగా నాకు చూపించాల్సిందే అన్నాడ‌ట బ‌న్నీ. దీంతో సుకుమార్‌ - ఎన్టీఆర్ క‌లిసి ఓ స్పెష‌ల్ షోని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. 12వ తేదీ అర్ధ‌రాత్రి హైద‌రాబాద్‌ లో ఆ షో ఉండొచ్చ‌ట‌. బ‌న్నీతో పాటు... ఎన్టీఆర్‌ కి స‌న్నిహితులైన రాజ‌మౌళి - వినాయ‌క్‌ - పూరి జ‌గ‌న్నాథ్‌ -  ప్ర‌భాస్ లాంటి తార‌లంతా ఆ షో చూసే అవ‌కాశం ఉంద‌ట‌.  సో... ఎన్టీఆర్ ఒక రోజు ముందుగానే స్నేహితుల‌కి ప్రేమని పంచబోతున్నాడ‌న్న‌మాట. 
Tags:    

Similar News