ఎన్టీఆర్ సూటేసుకుని.. సూట్ కేస్ ప‌ట్టుకుని

Update: 2016-01-03 04:19 GMT
ఇప్ప‌టికే చాలాసార్లు సంక్రాంతి విడుద‌ల అని క‌న్ఫ‌మ్ చేశాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. తాజాగా మ‌రోసారి క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు. సంక్రాంతికి రావ‌డంలో ఏ సందేహాలూ లేవ‌ని చెప్పేస్తూ పేప‌ర్ అడ్వ‌ర్టైజ్మెంట్ కూడా రాబోతోంది. శ‌నివారం పీఆర్వో బీఏ రాజు ఈ అడ్వ‌ర్టైజ్మెంట్ పోస్ట‌ర్ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు.సూటేసుకుని సూట్ కేస్ ప‌ట్టుకుని చాలా స్టైలిష్ గా ఉన్నాడు ఎన్టీఆర్ ఈ పోస్ట‌ర్లో. ఐతే ఇంకా సంక్రాంతి రిలీజ్ అంటూ.. ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కొంత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సినిమా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

నాన్న‌కు ప్రేమ‌తో ఫ‌స్ట్ కాపీ రెడీ అవ‌డానికి అటు ఇటుగా ఇంకో వారం ప‌ట్టే అవ‌కాశముంది. ప్ర‌స్తుతం లాస్ట్ సాంగ్ షూటింగ్ జ‌రుగుతోంద‌ట‌. ఎన్టీఆర్‌ - ర‌కుల్ ప్రీత్ ల‌పై హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన స్పెష‌ల్ సెట్లో ఈ పాట చిత్రీక‌రిస్తున్నారు.ఈ పాట షూటింగులో పాల్గొంటూనే ఎన్టీఆర్ డ‌బ్బింగ్ కూడా చెబుతున్నాడు. ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు డ‌బ్బింగ్ పూర్త‌యింద‌ట‌. మ‌రోవైపు రీ రికార్డింగ్‌, ఇత‌ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 10 లోపు సెన్సార్ పూర్తి చేయాల‌న్న లక్ష్యంతో సాగుతోంది సుక్కు టీం. సెన్సార్ అయ్యాకే రిలీజ్ డేట్ క‌న్ఫ‌మ్ చేస్తూ పోస్ట‌ర్లు వ‌దిలే అవ‌కాశ‌ముంది.
Tags:    

Similar News