ఎన్టీఆర్ నెక్ట్స్.. ముహూర్తం పెట్టేశారు

Update: 2017-01-18 06:12 GMT
జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఎట్టకేలకు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. దాదుపు మూడు నెలలు గ్యాప్ తీసుకుని దర్శకుడు బాబీతో మూవీని ఖాయం చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం.. ఇప్పటికే 'జై లవ కుశ' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తాడని.. జై.. లవ..కుశ.. ఆ రోల్స్ పేర్లని అందుకే ఈ టైటిల్ కి ఫిక్స్ అయ్యారని టాక్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీ  ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఎన్టీఆర్ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న యంగ్ టైగర్ 27వ సినిమాను అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి.. వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకున్నారట. జై లవకుశను.. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి విడుదల చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. పీకే.. 3 ఈడియట్స్.. లగేరహో మున్నాభాయ్ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సీకే మురళీధరన్ కు కేమెరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కెరీర్ లో.. జై లవకుశ మరో మైలురాయిగా నిలిచేంతటి సబ్జెక్ట్ ఉందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News